Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'నవతెలంగాణ'తో మండల వ్యవసాయ శాఖ అధికారి బాలకష్ణ
నవతెలంగాణ-తుంగతుర్తి
పంట అధిక దిగుబడి కోసం ఏం చేయాలి?
ఆశించిన ఫలితాలు నాణ్యమైన పంట ఉత్పత్తులు సాధించేందుకు మూలాధారం విత్తనం.దీనిని లక్ష్యంగా భావించిన వ్యవసాయ శాఖ నాణ్యమైన విత్తనాలను రైతు ముంగిటకు చేర్చేందుకు సమగ్ర ప్రణాళికను రూపొందించి ప్రధానంగా నకిలీ, అక్రమ విత్తనాలను సమూలంగా నిర్మూలించడం జరిగిందన్నారు.భూమిలో ఉన్న లోపాలు గుర్తించి, వాటిని సరి చేసుకుంటూ సమతుల్యంగా యజమాన్య పద్దతులు పాటిస్తే పెట్టుబడులు తగ్గించుకుని, దిగుబడి పెరిగి రైతు ఆర్థికాభివద్ధికి తోడ్పడతుందని తెలిపారు.
సాగు భూముల భూసార పరిస్థితి ఏమిటి..?
మండలంలో ఉన్న వ్యవసాయ భూముల్లో భాస్వరం అధికంగా ఉంది. కాబట్టి రైతులు భాస్వరం ఎరువుల వాడకం తగ్గించి భూమిలో ఉన్న భాస్వరాన్ని అందుబాటులో తీసుకొని మొక్క ఉపయోగించుకోవడానికి ఫాస్ఫరస్ సాల్బులైజింగ్ బ్యాక్టీరియా(పి.ఎస్. బి) వాడినట్లయితే సరిపోతుంది ఎకరానికి 500 గ్రామ్స్, 10 కేజీల పశువుల ఎరువుతో కలిపేయాలి వేయాలి. దానిని ఇతర ఎరువులతో కలిపి వేయకూడదు. వరి పొలంలో అయితే నాటు పెట్టిన 3 రోజుల్లో వేయాలి. అలాగే పచ్చి రొట్టలు, జీలుగలు వాడినట్లయితే భూమిలో సేంద్రియ కార్బన్ అభివద్ధి అవుతుంది.
మండలంలో వరినాట్లు ఎలా ఉన్నాయి.?
మండలంలో ప్రస్తుతానికి 2,900 ఎకరాలు పత్తి, వరి ప్రస్తుతానికి 4000 ఎకరాలు నాటు పెట్టడం జరిగింది. ఈ వాన కాలంలో 22 వేల ఎకరాల వరకు సాగు చేసే అవకాశం ఉన్నది.
వరిలో ఎరువలు వాడకం ఎలా..?
వరిలో ఒక ఎకరానికి బస్తా డీఏపీ, పొటాష్ 40 కేజీలు,యూరియా 2బస్తాలు పంట కాల పరిమితి మొత్తం మీద ఈ విధంగా ఉపయోగిస్తే సరిపోతుంది.నత్రజని ఎరువులను మూడు భాగాలుగా చేసి దమ్ములోను, దుబ్బు చేసే దశలో, అంకురం దశలో పలుచగా నీరు పెట్టి వాడాలి. బాస్వరం ఎరువులను ఆఖరి దమ్ములో మొత్తంగా వేసేయాలి, పొటాష్ ఎరువును ఆఖరి దమ్ములో సగం అంకురం దశలో సగం వాడాలి.
చీడపీడలు నివారణ ఎలా..?
వరిలో చీడపీడలు వ్యాపించకుండా సెంటు నారుమడిలో వారం రోజుల ముందు 160గ్రాముల 3జీ కార్భో గుళికలు వేయాలి. దీనివలన సుడి దోమ, అగ్గి తెగులు, రసం పీల్చే పురుగు, కాండం తొలిచే పురుగు నివారించబడతాయి.
పత్తి రైతులకు మీరిచ్చే సలహా..?
మండలంలో అధిక వర్షం నమోదైనందున అది తగ్గాక పంటలో నిలిచిన నీటిని కాలువలు ద్వారా తొలగించి19:19:19 లేదా మల్టీ పొటాషియం లేదా యూరియా 10 గ్రామ్స్/ లీటర్ నీటికి కలిపి ఒక వారంలో రెండు సార్లు పిచికారి చేయడం మంచిది. లేదా ఎకరానికి 20కేజీలు యూరియా, 10కేజీల పొటాష్ మొక్కకు 3అంగుళాల దూరంలో వేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. అలాగే అధికంగా నీరు నిలవడం వలన మొక్కల్లో ఎక్కడైనా తెగుళ్లు కనిపించినచో కాపర్ ఆక్సి క్లోరైడ్ 3 గ్రామ్/ లీటర్ కలిపి ఆ మొక్కల మొదలులో పోస్తే సరిపోతుంది.
పత్తిలో చీడపీడల నివారణ ఎలా..?
పత్తి పంటలో రసం పీల్చు పురుగులు నివారించడానికి 30వ రోజు, 45వ రోజు, 60వ రోజు, మొక్క కాండానికి మోనోక్రోటోపాస్ మరియు నీటిని 1:4 మందు పూస్తే నివారించడానికి దోహదపడుతుంది. లేదా ఎసిఫేట్ 1.5 గ్రామ్ లేదా ఫిప్రోనిల్ 2 మిల్లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
రౖతు బీమా ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఎవరు అర్హులు?
రైతు బీమా 18 నుంచి-59 సంవత్సరాలు గల రైతులు జూన్ 22 వరకు ఎవరికైతే కొత్తగా పట్టాదారు పాస్బుక్ వచ్చిందో వారు పట్టాదార్ పాస్ బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ నామిని యొక్క ఆధార్ కార్డు జిరాక్స్ వారి యొక్క వ్యవసాయ విస్తరణ శాఖ అధికారి ని సంప్రదించగలరు. 1 ఆగస్టు2022 చివరి తేదీ.