Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిల్లర్లు ఈనెల 31 లోగా సీఎంఆర్ డెలివరీ చేయాలని ఆదేశం
నవతెలంగాణ-నల్గొండకలెక్టరేట్
పట్టణంలోని సుమాంజలి పారాబాయిల్డ్ రైస్ మిల్లును మంగళవారం కలెక్టర్ రాహుల్‌శర్మ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి ఆకస్మిక తనిఖీ చేశారు.రైస్‌మిల్లు మిల్లింగ్ ప్రక్రియ ఏ విధంగా చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు సుమాంజలి .రైస్ మిల్లు వాన కాలం 2021 -2022 కు సంబందించి పెండింగ్ సి.యం.అర్ 225 ఏ.సి. కె గడువు లోగా డెలివరీ చేయాలని సూచించారు.సీఎంఆర్ లక్ష్యం మేరకు యాసంగి 2020 -21 కు సంబందించి 12000 మెట్రిక్ టన్నులు, వాన కాలం 2021 -2022 సంవత్సరం కు సంబంధించి 1,10,000 మెట్రిక్ టన్నులు సి.యం.అర్ పెండింగ్ లో వుందని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా జూలై 31 లోగా ప్రతి రోజు 2500 నుండి 3000 మెట్రిక్ టన్నులు డెలివరీ చేస్తూ గడువు లోగా పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు.రైస్ మిల్లులు అన్ని పూర్తి సామర్త్యం మేరకు పని చేయాలని ఆదేశించారు.తహసీల్దార్లు, డీటీలు ప్రతిరోజూ పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు,పౌర సరఫరాల డీఎం నాగేశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.