Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాడుగులపల్లి: మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు జెడ్పీటీసీ పుల్లెంల సైదులు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎరుకల వెంకన్నగౌడ్, వెంకట్ రెడ్డి మరియు మండలం లోని వివిధ గ్రామాల గ్రామాల వీఆర్ఏ లు పాల్గొన్నారు
దామరచర్ల : దామరచర్లలో వీఆర్ఏలు చేపట్టిన సమ్మెకు సీఐటీయూ మండల కార్యదర్శి దయానంద్ సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ జిల్లా కో-కన్వీనర్ పల్లా ప్రవీణ్‌కుమార్,జిల్లా నాయకులునాగిరెడ్డి, లక్ష్మి, డివిజన్ కో-కన్వీనర్లు బొజ్జ లక్ష్మీ శ్రీనివాస్, బెజ్జం కళ్యాణ్ దామచర్ల మండల అధ్యక్షులు చెన్నబోయిన నాగయ్య, షేక్ జానీభాషా, గండెల రామచంద్రయ్య, జింకల గోవిందు, కోట బాలకష్ణ పాల్గొన్నారు.
నాంపల్లి:మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏల సమ్మె 2వ రోజు కొనసాగింది. సమ్మెకు ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్ష నాంపల్లి చంద్రమౌళి సంఘీభావం తెలిపి మాట్లాడారు.సమ్మెకు సీఐటీయూ మద్దతు ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జేఏసీ జిల్లా కన్వీనర్ కోరే యాదిగిరి, అధ్యక్షుడు కార్యదర్శి మేడిపల్లివెంకటయ్య, కోరే యాదిగిరి, డివిజన్ గోవర్ధన్, జంగయ్య,ప్రవీణ్, కిషన్, నవీన, విజయ,సింగీత, వెంకటయ్య, చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడ: వీఆర్ఏలు తహసీల్దార్ కార్యాలయం చేపట్టిన నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది.సమ్మెకు సంఘీభావం కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు రెమిడాల పరశురాములు, జిల్లా కమిటీ సభ్యులు కోడిరెక్క మల్లయ్య తెలిపారు.సంఘీభావం తెలిపిన వారిలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ పట్టణఅధ్యక్షులు ఎంఏ నహీద్, వీఆర్ఏల సంఘం నాయకులు సైదులు. సురేష్, భాష, శంకర్, చంద్రయ్య, సరిత, మనీ, సలీమా, పావని, నవీన్ పాల్గొన్నారు.
దేవరకొండ : తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె కొనసాగింది.తెలంగాణ గౌడగీత సంఘాల సమన్వయ కమిటీ జిల్లా చైర్మెన్ చింతపల్లి శ్రీనివాస్‌గౌడ్, బీజేపీ నాయకులు బెజవాడ శేఖర్, నర్సింహ, కళ్యాణ్‌నాయక్, కేతావత్ లాలు నాయక్ మద్దతు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం డివిజన్ చైర్మెన్ తిరగమల్ల సాల్మన్,నగేష్, మండల చైర్మెన్ జాగతిజగన్,పురుషోత్తం, వెంకటయ్య, నరేందర్, గిరి, రఘు, మల్లేష్,అంజి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నకిరేకల్ : అర్హత కలిగిన వీఆర్ఏ లందరికీ ప్రమోషన్ ఇవ్వాలని టీపీసీసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు.స్థానిక తహసీిల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు పన్నాల రాఘవరెడ్డి, కాంగ్రెస్ నాయకులు కొండ శంకర్‌గౌడ్, మైనారిటీ నాయకులు రియాజ్‌ఖాన్, సురిగి జ్యోతి, గిరి పాల్గొన్నారు.
తిరుమలగిరిసాగర్ :మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కూన్‌రెడ్డి నాగిరెడ్డి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కొరర్రా శంకర్‌నాయక్ మద్దతు తెలిపారు.ఈకార్యక్రమంలో వీఆర్ఎల మండల సంఘం అధ్యక్షుడు లింగపల్లి నర్సయ్య కొర్ర బాలాజీ,భవాని,సత్రశాల నర్సయ్య,మంగమ్మ,కిలారి దుర్గాప్రసాద్,లక్ష్మయ్య,ఓంకారం,సొందు,సత్తయ్య,మౌళి,సత్యం తదితరులు పాల్గొన్నారు.
కొండమల్లేపల్లి :మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె కొనసాగింది.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మెన్ దూదిపాల వేణుధర్‌రెడ్డి, సర్పంచులు ఇస్లాత్ రాకేష్‌నాయక్,గడ్డం శ్రీరాములు, పంది రుద్రమ్మ, శ్రీను, వీఆర్ఏలు విజరు, ముత్యం, ఎస్కే లాల్, మహ్మద్మహబూబ్,సత్తయ్య, రామకష్ణ, వెంకటరెడ్డి పాల్గొన్నారు.