Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోదాడరూరల్
కార్మిక చట్టాల సవరణను వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు.మంగళవారం పట్టణంలోని లేబర్ కార్యాలయం ముందు ఆ సంఘం ఆధ్వర్యంలో షెడ్యూల్ పరిశ్రమల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు.జూనియర్ అసిస్టెంట్ మసీదుకు వినతిపత్రం అందజేశారు.అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పి కొట్టాలని, రాష్ట్రంలో కనీస వేతనాల చట్టం పరిధిలో 73 షెడ్యూల్ ఎంప్లాయిమెంట్ట్స్ ఉన్నారనీ వీటిలో సుమారు కోటి మందికి పైగా కార్మికులు పనిచేస్తున్నారని వారందరికీ ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరిగిన ధరలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు సవరించాల్సి ఉండగా నేటికీ అమలు చేయలేదని వారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాలు గడిచిన టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల కనీస వేతనాలు సవరించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు .హమాలీ కార్మికులను వెల్ఫేర్ బోర్డులో చేర్పించాలని భవన నిర్మాణ, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులకు 57 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశార్ను. రాష్ట్రంలో ఉన్న సంఘటిత సంఘటితంగా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటియు నిరంతరం పోరాటాలు చేస్తుందని అని వారన్నారు .ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి మిట్టగనుపుల ముత్యాలు, జిల్లా కమిటీ సభ్యులు కోటగిరి వెంకటనారాయణ, ఎలక సోమయ్య, రాధాకష్ణ ,వట్టెపు సైదులు ,బి స్వరాజ్యం, పీ కాటయ్య ,బాలాజీ నాయక్, సతీష్, లింగయ్య, వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.