Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ కార్యకర్తగా గవర్నర్ వ్యవహారం
- సీఎం రమేశ్‌కు అవగాహన లేదు
- మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
రాష్ట్రం అప్పులకుప్పలా మారిందన్న కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి ఘాటుగా స్పందించారు.రాష్ట్ర సంపదను కేసీఆర్ పెంచుతున్నారని మంత్రి చెప్పారు.కేసీఆర్ సీఎం అయిన తర్వాతే రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం పెరిగిందని స్పష్టం చేశారు.మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు.కేంద్రంతప్పుడు విధానాలతో దేశ ప్రజల తలసరి ఆదాయం తగ్గిందని తెలిపారు.తెలంగాణలో బాధ్యతా రాహిత్యమైన, విచిత్ర ప్రతిపక్షాలు ఉన్నాయని జగదీశ్ రెడ్డి విమర్శించారు. వార్తల్లో ట్రెండింగ్ కావడం కోసం ప్రతిపక్ష నాయకులు పోటీ పడుతున్నారని పేర్కొ న్నారు.ప్రజా సమస్యలపై మాట్లాడటానికి ఏమీ లేక కేసీఆర్‌పై నోరు పారేసుకు ంటున్నారని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం అప్పుల మీద పార ్లమెంటులో మాట్లాడకుండా, రాష్ట్ర అప్పులపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.డీ, సీబీఐ వంటి సంస్థలను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని కానీ కేసీఆర్ నిప్పులాంటి మనిషి అన్నారు.ఆయన్ను ముట్టుకోవడం ఎవరి వల్లా కాదని స్పష్టం చేశారు. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఒక బీజేపీ కార్యకర్తగా వ్యవహరి స్తుందనివిమర్శించారు.రాజకీయ కార్యకలాపాలకు రాజ్ భవన్ కేంద్రంగా మారుతుందని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు, భద్రాచలంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన సీఎం రమేశ్ వ్యాఖ్యలపై కూడా మంత్రి మండిపడ్డారు. కాళేశ్వరం ఎక్కడుందో.. భద్రాచలం ఎక్కడుందో తెలియకుండా సీఎం రమేష్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.వరద నీటితో ప్రాజెక్ట్ పైభాగం లేక కింది భాగం మునుగుతుందో అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు.
సీఎంసహాయనిధితో పేదలకు భరోసా
నిరుపేదల ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం సీఎం సహాయ నిధి ద్వారా భరోసా కల్పిస్తుందని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు.మంగళవారం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో మంజూరైన 55 లక్షలా 29 వేలా 500 రూపాయల విలువగల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను 115 మంది లబ్దిదారులకు ఆయన పంపిణీచేసి మాట్లాడారు.టీఆర్ఎస్ ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాల సంక్షేమం విషయంలో పూర్తి భరోసా కల్పిస్తోందన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిరుపేదలకు తెలంగాణ పభ్రుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి కింద చికిత్సకు తగిన ఆర్థిక సాయం బాధితులకు అందిస్తోందన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న ప్రతి పథకం నిరుపేదలకు అందుతున్నదన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ పెరుమాళ అన్నపూర్ణ, జిల్లా గ్రంధాలయ చైర్మెన్ నిమ్మలశ్రీనివాస్ , టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, పట్టణ అధ్యక్షులు సవరాల సత్యనారయణ, టీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి బూర బాలసైదులు గౌడ్, పట్టణ ఉపాధ్యక్షులు చాంద్ పాషా, జెడ్పీటీసీ జీడిభిక్షం, ఎంపీపీ రవీందర్‌రెడ్డి, మండల అధ్యక్షుడు వంగాల శ్రీనివాస్ రెడ్డి, చివ్వెంల ఎంపీపీ కుమారి బాబునాయక్, జెడ్పీటీసీ సంజీవనాయక్, మండల అధ్యక్షుడు జూలకంటి జీవన్‌రెడ్డి, పెన్ పహాడ్ జెడ్పీటీసీ మామిడి అనిత అంజయ్య, మండల అధ్యక్షుడు దొంగరి యుగంధర్, ఆత్మకూర్‌ఎస్ ఎంపీపీ మర్లస్వర్ణలతాచంద్రారెడ్డి, మండల అధ్యక్షుడు తూడి నర్సింహారావు,కౌన్సిలర్లు గండూరి పావనికపాకర్, సుంకరి రమేష్, బాషామియా, రాపర్తి శ్రీనివాస్, అనంతులయాదగిరి, లక్ష్మి మకత్ లాల్, రవి, లింగానాయక్, ఎలిమినేటి అభినరు, రంగినేని లక్ష్మణ్‌రావు, జీవీ.రావు, కడారి సతీష్‌యాదవ్, ముదిరెడ్డి సంతోష్‌రెడ్డి, కిరణ్, బొమ్మిడి అశోక్, కరుణశ్రీ, దండు రేణుక, అంజమ్మ,విజయ, పాల్గొన్నారు.