Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-తిరుమలగిరి
వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వడంతో పాటు అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని అఖిలభారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సభ్యులు ములకలపల్లి రాములు డిమాండ్ చేశారు. మంగళవారం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వీఆర్ఏలకు ఆయన సంఘీభావం తెలిపి మాట్లాడారు.వీఆర్ఏలను రెగ్యులర్ చేసి కనీసవేతనం 21,000 ఇవ్వాలన్నారు.వీఆర్ఏలుగా పని చేస్తూ చనిపోయిన వారికి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.దీక్షకు వ్యకాస సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి మట్టిపల్లి సైదులు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కడెంలింగయ్య పాల్గొని సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్వోలు కందుకూరి నాగయ్య, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
చివ్వెంల: మండలకేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేశారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏలు సతీష్, నజీర్, విజరు, శోభ, రంజాన్,వీరయ్య, నవ్య, మైబెళ్ళి, బుచ్చయ్య, జయమ్మ, లచ్చమ్మ పాల్గొన్నారు.
ఆత్మకూర్‌ఎస్ : వీఆర్ఏల నిరవధిక సమ్మెకు మండలంలోని వీఆర్ఓలు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఓల సంఘం మండలఅధ్యక్షుడు ఇరుగు వీరస్వామి,పంతంగి వెంకన్న, ఎండి జాని, అనంతయ్య, సైదులు, ప్రవీణ్, వీఆర్ఏలు కాసాని వెంకన్న, పల్లెల సైదులు, కవిత, పాపయ్య, నాగయ్య, మల్సూర్, మహేష్ పాల్గొన్నారు.
నేరేడుచర్ల: పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల దీక్షా శిబిరాన్ని సీపీఐ జిల్లా నాయకులు ధూళిపాక ధనుంజయనాయుడు రైతుసంఘం మండలగౌరవాధ్యక్షుడు అంబటి భిక్షం, రైతు నాయకులు అంబటి గోపయ్యతో కలిసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ సంఘం నాయకులు ఎస్కె.సైదులు, ఝాన్సీ, చంద్రకళ, లక్ష్మి,శోభారాణి,మణి, రాధ, ఖాదర్, సైదులు, నాగు పాల్గొన్నారు.
నూతనకల్ :మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో ఐక్యసంఘాల ఆధ్వర్వంలో వీఆర్ఏలు ధర్నా నిర్వహించారు.ధర్నాకు వీఆర్ఓలు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు సైదులు, జహంగీర్,భిక్షంరెడ్డి, నాగేశ్వరరావు, లక్ష్మీబాయి, రమా, ఉపేంద్ర పాల్గొన్నారు.
తుంగతుర్తి:మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె కొనసాగింది.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షులు కాకులారపు వినోద్‌రెడ్డి, డివిజన్ ప్రెసిడెంట్ గుగులోతు భాస్కర్, ఉపాధ్యక్షులు రాధాకష్ణ ,వైరు మాణిక్యం,షేక్ పాషా, ధనమ్మ, రేణుక, నాగమ్మ, యాకమ్మ, వెంకటమ్మ, పద్మయ్య పాల్గొన్నారు.
అనంతగిరి: మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏల సమ్మె కొనసాగింది.సమ్మెకు వీఆర్ఓలు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండలకమిటీ అధ్యక్షుడు సయ్యద్జాని,మదర్ సాహెబ్, జిల్లా కో కన్వీనర్ చెవుల సునీత, డివిజన్ కో కన్వీనర్ నాగమణి, ఎన్ సైదులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
నాగారం : మండలకేంద్రంలోని తహసీిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యక్షుడు దాసరి రమేష్,వీఆర్ఏలు అనంతుల మహేశ్వరి, అనిత, సరిత,కవిత, అశోక్, సురేష్, రాజు, సల్మాన్ పాల్గొన్నారు.
కోదాడరూరల్ : పట్టణంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల సమ్మె కొనసాగింది.సమ్మెలకు సీఐటీయూ జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కమిటీ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు,సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు మిట్టగనుపులముత్యాలు, వట్టెపు సైదులు, జిల్లా నాయకులు జిల్లేపల్లి నరసింహారావు, ములకలపల్లి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో 7 వ రోజుచేపట్టిన ఏర్పాటుచేసిన నిరాహారదీక్షకు కాంగ్రెస్ నాయకులు పందిరినాగిరెడ్డి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఏపూరి రాజు మాదిగ,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు సిద్దెల శ్రీను మాదిగ , నియోజకవర్గ ఇన్చార్జి కుక్కల కష్ణ మాదిగ ,ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు కుడుముల శ్రీను, పట్టణ ఉపాధ్యక్షులు ఏపూరి సత్యరాజు మాదిగ, బీసీ నాయకులు జంపాల భద్రయ్య పాల్గొన్నారు.
మఠంపల్లి : మండలకేంద్రంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని సమ్మెచేపట్టారు.ఈకార్యక్రమంలో నరసింహారావు,ఉపేందర్, నాగుల్‌మీరా, యూసఫ్, మట్టపల్లి తదితరులు పాల్గొన్నారు.
మునగాల:మండలకేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏల ధర్నా కొనసాగింది.సమ్మెకు కేవీపీఎస్ జిల్లా కమిటీ మద్దుతు తెలిపింది.ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోటగోపి, సీపీఐిఐఎం మండల కార్యదర్శి రైతు చందాచంద్రయ్య,కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నందిగామ సైదులు, వీఆర్ఏలు పాల్గొన్నారు.
సూర్యాపేట : వీఆర్ఏలకు పేస్కేల్‌ను వెంటనే అమలుచేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం పెన్‌పహాడ్ మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహిస్తున్న నిరవధికసమ్మెకు ఆయన మద్దతు తెలిపి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ చైర్మెన్ గోపి నర్సయ్య, మండల వీఆర్ఏల అధ్యక్షులు పఠాన్ జానీపాషా, సీపీఐ(ఎం)జిల్లా కమిటీ సభ్యులు చిన్నపంగి నర్సయ్య, మండల కార్యదర్శి రణపంగ కష్ణ, వీఆర్ఏలు మధ్యల మధుసూదన్, మీసాల పద్మనాగయ్య, పఠాన్ జానీపాషా, కామల్ల వెంకటయ్య, జంజిరాల పిచ్చమ్మ, రాయిప్రభాకర్, రాములు, రాణి, ఎల్లమ్మ, వెంకన్న, రామకష్ణ, బాల సైదులు, తదితరులు పాల్గొన్నారు.