Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నకిరేకల్
మున్సిపాలిటీ పరిధిలోని మూసీ రోడ్డు పద్మశాలి కాలనీలో గల చేనేత కుటుంబాలను ఆదుకోవాలని కోరుతూ పద్మశాలీలు మంగళవారం స్థానిక తహసీల్దార్ ప్రసాద్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంజి మురళీధర్ మాట్లాడుతూ 20 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చేనేత మగ్గాల గుంతలలోకి నీరు వచ్చి చేరడంతో పని లేక ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న 23 కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.సంబంధిత చేనేత కుటుంబాలకు స్టాండ్ మగ్గాలు అందజేయాలని కోరారు.చేనేత కార్మిక కుటుంబాలకు నూలురంగులు,రసాయనాలు సబ్సిడీతో ఇవ్వాలని, చేనేత బీమా అమలుచేయాలని, ప్రతి కార్మికునికి రోజువారి కూలీ రూ.750 ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో చేనేత పారిశ్రామిక సహకార సంఘం పర్సన్ ఇన్చార్జి చిలుకూరి లక్ష్మీనరసయ్య, గంజి ఎల్లయ్య, అయిటిపాముల ధర్మయ్య, జెల్లా లక్ష్మీనారాయణ, పున్న మార్కండేయ, బి.వెంకన్న, యన్నం వెంకటయ్య, నగేష్, పొట్టబత్తుల జనార్దన్ పాల్గొన్నారు.