Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నల్లగొండ
బీసీల విద్య, ఉద్యోగ, సామాజిక, హార్దిక రాజకీయ రంగాలలో దామాషా పద్ధతిన ప్రాతినిధ్యం దక్కాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 7న న్యూఢిల్లీలో జరుగు భారత జాతీయ ఓబీసి మహాసభ , అలాగే ఆగస్టు8న పార్లమెంటు ముట్టడి కార్యక్రమ పోస్టర్ను మంగళవారం జిల్లాకేంద్రంలోని బీసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చక్ర హరి రామ రాజు, వైద్యుల సత్యనారాయణ ఆవిష్కరించి మాట్లాడారు.ఈ మహాసభలో కుల జనాభా ప్రకారం అన్ని రంగాల్లో బీసీలకు సమాన వాటాను ప్రభుత్వం కల్పించాలని, ఏప్రిల్ 2023లో జరుగు జనగణనలో బీసీ జనగణన చేపట్టాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, బీసీలకు క్రిమిలేయర్ ఎత్తివేయాలని, కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా దక్కాలని కోరారు. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని, న్యాయమూర్తుల నియామకంలో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించాలని తదితర డిమాండ్లతో కూడిన అంశాలను చర్చించి వీటిపై దేశవ్యాప్తంగా ప్రజల మద్దతుతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం కోసం ఈ మహాసభ జరుగుతుందని ఈ మహాసభలో పాల్గొనడానికి నల్లగొండ జిల్లా పక్షాన పెద్ద ఎత్తున బీసీలు చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి వెళ్లి విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కోశాధికారి నల్ల సోమయ్య, సీనియర్ ఉపాధ్యక్షులు కాసోజు విశ్వనాథన్, నకిరేకంటి కాశయ్యగౌడ్, గండిచెరువు వెంకన్నగౌడ్, కట్టెకోలు దీపేందర్, సొల్లేటి రమేష్, జవ్వాజి ఇంద్రయ్య. పసుపులేటి సీతారాములు, నాగుల పల్లి శ్యాంసుందర్, నిమ్మల కోటి కష్ణయ్య, వెంకటయ్య బెస్త, కొడుదుల ఎల్లం రాజు, గంజి బిక్షమయ్య, ఎలిజాల వెంకటేశ్వర్లు, రేగట్టె సైదులు, పాల్గొన్నారు.