Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ-నల్లగొండ
వర్షాలు తగ్గినా సీజనల్ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, వైద్యారోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు.మంగళవారం జిల్లాకేంద్రంలో జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిని ఆయన ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు.అనంతరం వర్షాల అనంతరం ప్రబలుతున్న సీజనల్‌వ్యాధులపై జిల్లాస్థాయి అధికారులతో మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా ఈ సీజనల్ వ్యాధులు చాలా వరకు తగ్గాయన్నారు.మిషన్ భగీరథ పథకం ద్వారా సురక్షిత మంచినీటి సరఫరాతో చాలా వరకు అంటూ వ్యాధులు, సీజనల్వ్యాధులు ప్రబలకుండా తగ్గాయని స్పష్టం చేశారు.మలేరియా, డెంగ్యూ కేసులు పెరగకుండా నివారణ చర్యలు తీసుకుంటున్నామని, అన్ని జిల్లాల్లో కిట్స్ అందుబాటులో ఉంచామని స్పష్టం చేశారు.ప్రతి ఆదివారం హెల్త్ టీమ్ శుభ్రతకు సంబంధించిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామని చెప్పారు.నిల్వ ఉన్న నీటి ద్వారా డెంగ్యూ వ్యాప్తి చెందుతుందన్నారు.ప్రజలందరూ తమ తమ ఇండ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. వ్యాధులు రాకుండా ఉండేందుకు ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.
బూస్టర్ డోస్ వేసుకోండి..
బూస్టర్ డోస్ వేసుకోవాలని ప్రజలందరికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వనికి సహకరించాలని కోరారు.ఈకార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.