Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీఎంహెచ్ఓ కోటాచలం
నవతెలంగాణ-సూర్యాపేట
జిల్లాలోని అన్ని కస్తూర్బా గాంధీ బలబాలికల కేంద్రాలు , అన్ని సమీకృత వసతి గృహాలు, గురుకులాలు సమీకృత ఆవాసాలలో దోమల మందు పిచికారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని డీఎంహెచ్ఓ కోటాచలంఅన్నారు.మంగళవారం స్థానిక గురుకుల వసతి గహంలో దోమల మందును పిచికారీ చేయించిన అనంతరం ఆయన మాట్లాడారు.దోమలు పుట్టకుండా కుట్టకుండా చూసుకోవాలన్నారు.ఆల్ఫా సైఫర్ మెత్రిన్ ద్రావకాన్ని పంపు ద్వారా అన్ని గోడలకు స్ప్రేయింగ్ చేసినట్లు తెలిపారు. దోమలు వీటి తాకిడికి చనిపోతాయని తెలియజేశారు. దోమల నియంత్రణకు సంహారక మందులు పిచికారి అనే విధానం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, జిల్లా ప్రోగ్రాం మేనేజర్ భాస్కర్‌రాజు, సబ్ యూనిట్ ఆఫీసర్ బొమ్మగాని నరసయ్య, మనోజ్, కడారి రమేష్, వెంకయ్య ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.