Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
దోపిడిడీ వ్యతిరేకంగా రైతు సమాజం కోసం త్యాగాలు చేసిన అమరవీరుల ఆశయాల కోసం ప్రజా ఉద్యమాలు ఉధతం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజుగౌడ్, మంగ నర్సింహులు కోరారు.మండలకేంద్రంలో మంగళవారం ఆ పార్టీ సీనియర్ నాయకులు అమరజీవి సుదగాని ఎట్టయ్య 14వ వర్థంతి సభ ఏసీరెడ్డి భవన్లో నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికై జీవితాంతం ఎర్రజెండా నీడలో పనిచేసిన ఎట్టన్న జీవితం చిరస్మరణీయమైనదన్నారు.పసిపిల్లలు తాగే పాల పైన ఐదు శాతం జీఎస్టీ విధించిన బీజేపీ ప్రభుత్వం విలాసవంతమైన వస్తువులపై జీఎస్టీ విధించకపోవడం శోచనీయమన్నారు.పాలకులు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలు నిర్వహించినప్పుడే అమరవీరులకు ఇచ్చే నిజమైన నివాళులని చెప్పారు.ముందుగా యెట్టన్న చిత్రపటానికి పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు బోలగాని జయరాములు,మాజీ సింగిల్విండో చైర్మెన్ మొరిగాడి చంద్రశేఖర్, జూకంటి పౌల్, సుదగాని సత్యరాజయ్య, బుగ్గనవీన్, తాళ్లపల్లి గణేష్, మిట్ట శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.
ఆలేరురూరల్: పీడిత ప్రజల విముక్తికై పోరాడిన నాయకుడు సుదగాని ఎట్టన్న అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి దుపటి వెంకటేష్ అన్నారు.మండలంలోని శర్బనపురం గ్రామంలో ఎట్టయ్య 14వ వర్థంతి నిర్వహించారు.పార్టీ మండలకార్యవర్గ సభ్యులు సత్యరాజయ్య జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో మండల కార్యవర్గ సభ్యులు బుగ్గ నవీన్,గ్రామ కార్యదర్శి సిరిగిరి సారయ్య,ఉపసర్పంచ్ గడ్డమీది నరేష్,మాజీ సర్పంచులు సైదాపురంనర్సయ్య, సుదగాని నర్సమ్మ, మాజీ గ్రామ కార్యదర్శి కారేరాజు, సీనియర్ నాయకులు ముత్తిరెడ్డి,ఎర్రయ్య, నర్సయ్య, యాదగిరి, నరేందర్, యాదగిరి, అచయ్య పాల్గొన్నారు.