Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డిగ్రీ(ఐడీ)కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ బెల్లి యాదయ్య
నవతెలంగాణ-రామన్నపేట
ఇంటర్ ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ తప్పకుండా డిగ్రీలో చేరాలని, కుటుంబసమస్యల కారణంగానో, చిన్నా చితకా ప్రయివేట్ ఉపాధి అవకాశాల కారణంగానో ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపితే, ఈ డ్రాప్ ఔట్ ఇటు వ్యక్తిగతంగా విద్యార్థులకూ, అటు సమాజపరంగా జ్ఞాన రంగానికి ఎంతో నష్టదాయకమని జిల్లా డిగ్రీ(ఐడీ)కళాశాల ప్రధానాచార్యులు డా.బెల్లి యాదయ్య అన్నారు.మంగళవారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మరో నాలుగు రోజుల్లో మొదటి విడత డిగ్రీ ప్రవేశాలకు గడువు ముగుస్తున్న సందర్భంగా ఉన్నత విద్యలో డ్రాప్ ఔట్ నివారణ నిమిత్తం కళాశాలలోని దోస్త్ హెల్ప్ లైన్ కేంద్రానికి వచ్చిన విద్యార్థులు తల్లిదండ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ తరంలో ప్రతి యవతీ, యువకుడు కనీసంగా డిగ్రీ వరకు చదవాలన్నారు.ఉన్నత విద్య వ్యక్తిత్వ వికాసానికి సమాజాభివద్ధికి దోహద పడుతందున్నారు. గ్రీకి ఆప్షన్ ఇచ్చుకునే క్రమంలో తల్లిదండ్రులు తమ పిల్లలతో చేరదలచుకున్న కళాశాలలను సందర్శించి మౌలిక సౌకర్యాలను తెలుసుకోవాలన్నారు.జిల్లాలోని రామన్నపేట, ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు న్యాక్ బీ ప్లస్ గ్రేడు పొందాయని, విద్యార్థుల సమగ్రాభివద్ధికి కావాల్సిన అన్ని వసతులను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.విద్యార్థులు తమకు ఇష్టమైన ఏ మూడు సబ్జెక్టులనైనా తీసుకుని చదివేందుకు వీలుగా సీబీసీఎస్ విధానం అందుబాటులో ఉంచిందన్నారు.ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.