Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంస్థాన్‌నారాయణపురం
నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం మండలంలోని అల్లందేవి చెరువు గ్రామంలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి మాట్లాడారు.్ణప్రజా ఓట్లతో గెలుపొందిన నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలకు బదులు ప్రజలను ఇబ్బందులకు గురి చేసే విధంగా నిత్యవసర వస్తువులపై జీఎస్టీ విధించడం సరికాదన్నారు.కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ వల్ల పేదలు ఆహారానికి దూరమవుతున్నారన్నారు.పాలు పెరుగు నెయ్యి పప్పులు వంట నూనెలపై జీఎస్టీ విధించడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు జనిగల నరసింహ,దోనూరు నిర్మల, ఉప్పలపల్లి బాలకష్ణ, గుండు జంగయ్య,గంగాదేవి బిక్షపతి, జనిగాల పద్మ,చిరగొని మారయ్య, గుండు దశరథ,గుండు సుధాకర్, బద్దం బాల్‌రెడ్డి,గుండు జయమ్మ, ప్రభాకర్,గంగాదేవి పుష్పలత, జనగల రాజు,బద్దం యాదిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యాదగిరిగుట్ట:పాల ఉత్పత్తిదారుల కుటుంబాలకు నష్టం కలిగించే జీఎస్టీని రద్దు చేయాలని తెలంగాణ పాడి రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్ మంగ నర్సింహులు డిమాండ్ చేశారు. మంగళ వారం మండలంలోని చిన్న కందుకూరులో పాలు పాల ఉత్పత్తుల యంత్రాలపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన జీఎస్టీని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పాలు ,పెరుగు, మజ్జిగ పై ఐదు శాతం యంత్రాలపై 12 శాతం నుండి 18% జిఎస్టిని కేంద్ర ప్రభుత్వం పెంచిందని,ఇది అత్యంత దుర్మార్గమని దుయ్యబట్టారు.పెండింగ్‌లో ఉన్న లీటరు పాలకు నాలుగు రూపాయలు ఇన్సెంటివ్ డబ్బులను వెంటనే చెల్లించాలన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు బబ్బురి పోశెట్టి ,సుబ్బరు సత్యనారాయణ చైర్మన్ ఎర్ర రమేష్ ,ఆవిడ శెట్టి రవీందర్ ,కాటం లక్ష్మి గవ్వల కిష్టయ్య ,సత్తయ్య ,దొడ్డి నరసయ్య ,దొడ్డి కృష్ణ ,బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.