Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి
నవతెలంగాణ - భువనగిరి
73 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమల కనీస వేతనాల జిఓ లను సవరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ జరుప తలపెట్టిన ఆగస్టు 3 చలో హైదరాబాద్ కు తరలి వెళ్ళుదామని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కోమటిరెడ్డి చంద్రారెడ్డి కార్మికులకు పిలుపునిచ్చారు.గురువారం రాజాపేట మండలంలోని బసంతపూర్ లో భవన నిర్మాణ కార్మికులతో కలిసి చలో హైదరాబాద్ కు సంబంధించిన వాల్ పోస్టర్స్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతి అయిదేళ్ళకోసారి సవరణ చేయాల్సిన జీవోలను 10-12 సంవత్సరాలవుతున్నప్పటికీ ఏ ఒక్క జిఓ ని సవరించకుండా కార్మికుల శ్రమను యధేచ్చగా దోపిడీ చేసుకునేందుకు యాజమాన్యాలకు కావల్సినంత అండగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశం, సిఐటియు మండల నాయకులు బబ్బూరి శ్రీనివాస్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నరేష్, పిల్లిట్ల మురారి, మహేందర్, చిరంజీవి, రమేశ్, గోవర్ధన్, ముల్కలపల్లి యాదగిరి పాల్గొన్నారు.