Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
మండలంలోని నందనం గ్రామంలో ఏర్పాటు చేయనున్న తాటి ఉత్పత్తుల కేంద్రం (నీరా) ప్రాజెక్టు శంకుస్థాపనకు ఏర్పాట్లను భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి గురువారం స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శుక్రవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా ఎనిమిది కోట్ల రూపాయలతో నీరా ఉత్పత్తి కేంద్రానికి శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. శంకుస్థాపన సందర్భంగా సభకు ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం కల్లుగీత వత్తిపైన ఆధారపడి జీవన కొనసాగిసిన గీత కార్మికులకు ఉపాధి కల్పన కోసం తాటి ఉత్పత్తుల కేంద్రాన్ని నందనంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంధాలయ సంస్థ చైర్మెన్జడల అమరేందర్ గౌడ్, ఎంపీపీ నారాల నిర్మల వెంకటస్వామి యాదవ్, జడ్పిటిసి సుబ్బురు బీరు మల్లయ్య, మండల అధ్యక్ష కార్యదర్శులు జనగాం పాండు, ఓం ప్రకాష్ గౌడ్, రైసస మండల కోఆర్డినేటర్ కంచి మల్లయ్య, సింగిల్ విండో వైస్ చైర్మన్ మహేందర్ నాయక్, జిల్లా నాయకులు అతికం లక్ష్మీనారాయణ గౌడ్, బాల్గురి మధుసూదన్ రెడ్డి కేశవపట్నం రమేష్, జక్కా కవిత రాఘవేందర్ రెడ్డి, కడమంచి ప్రభాకర్, నాగేలి రమేష్, పాండు పాల్గొన్నారు.