Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గుండాల
మండలంలోని మరిపడిగ గ్రామంలో పంట చేనుల,పంటల వివరాల నమోదు కార్యక్రమాన్ని గురువారం జిల్లా వ్యవసాయాధికారి అనురాధ పరిశీలించారు.ఈసందర్భంగా ఆమె రైతులకు పలు సూచనలు చేశారు.రైతులు పత్తి పంటలో కాండం పూత పద్ధతిని పాటించి పెట్టుబడి తగ్గించుకోవచ్చని,కాండం పూత పద్ధతిలో 100 ఎంఎల్ మోనోకి 300 ఎంఎల్ నీటిని కలిపి కాండానికి పూయడం వల్ల తెగుళ్లను నివారించవచ్చని అన్నారు.ఈకార్యక్రమంలో మరిపడిగ సర్పంచ్ దుంపల శ్రీనివాస్,ఉపసర్పంచ్ శ్రీను,ఏఈఓ రాంసింగ్,రైతులు చంద్రశేఖర్,గురుమూర్తి,యాకయ్య,ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.