Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చింతలపాలెం: పేదింటి ఆడ బిడ్డలకు సీఎం కేసీఆర్ మేనమామని, ఆడబిడ్డలకు పుట్టినిల్లుగా తెలంగాణ ప్రభుత్వమని హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం పీఏసీిఎస్ నూతన గోడౌన్ ప్రారంభించి, అనంతరం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివద్ధి చేస్తానని, రైతు బాంధవుడు సీఎం కేసీఆర్ అని, రైతులకు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఉచితంగా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని, సీఎం కేసీఆర్ నేతత్వంలో రైతులకు పెట్టుబడికి ఇబ్బంది జరగకుండా రైతుబంధు లాంటి అద్భుత పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందని, అంతేకాకుండా ప్రమాదవశాత్తు, దురదష్టవశాత్తు రైతు ఏ కారణం చేతనైన మరణిస్తే ఎటువంటి పైరవీలు లేకుండా నేరుగా రైతు కుటుంబ సభ్యులకు ఐదు లక్షల రూపాయలు అందిస్తున్న ఘనత కూడా సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. వంద మందికి ఒక కోటి పదకొండు వేల ఆరు వందల (1,00,11,600/) రూపాయల కళ్యాణ లక్ష్మి, షాధి ముబారక్ చెక్కులు, పదకొండు మందికి సీఎం రిలీఫ్ ఫండ్ లబ్దిదారులకు మూడు లక్షల నలభై మూడు వేలు (3,43,000) రూపాయల చెక్కులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొత్తమద్ది వెంకటరెడ్డి, జడ్పిటిసి చింతరెడ్డి చంద్రకళ సైదిరెడ్డి, తహశీల్దార్ సచిన్ చంద్ర తివారి, ప్రజాప్రతినిధులు, అధికారులు, డీసీసీబీ డైరెక్టర్లు పీఏసీఎస్ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, సర్పంచులు, ఎంపిటిసిలు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.