Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్
తుంగతుర్తి:ఓనమాలు దిద్దిన చదువుల తల్లి ఒడిని,విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలను చేర్చిన ఉపాధ్యాయులను, దేవాలయం లాంటి బడిని మర్చిపోవద్దని, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1986-87లో పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేశారు.ఈ మేరకు పాఠశాల అభివద్ధికి పూర్వ విద్యార్థులు తమ వంతు సహాయంగా లక్ష రూపాయల విలువ చేసే లాప్టాప్, బ్యాడ్జీలను వారు ఎమ్మెల్యే చేతుల మీదుగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొండగడుపుల యాకయ్యకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి బోయిని లింగయ్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ డైరెక్టర్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి, వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం యాదవ్, మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య ,తాసిల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో భీమ్ సింగ్ నాయక్ ,సిడిపిఓ శ్రీజ, పూర్వ విద్యార్థులు ఓరుగంటి సుభాష్ ,కటకం వెంకటేశ్వర్లు, ఎర్ర హరికష్ణ ,గుజ్జ వేణు ఉపాధ్యాయ బందం పాల్గొన్నారు.