Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిరుమలగిరి:మండలంలోని కోట్యానాయక్ తండ గ్రామపంచాయతీ పరిధిలోని గుళ్ల బండ తండ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అదే గ్రామానికి చెందిన 1998-1999 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు 13 సైకిళ్లను కొనుగోలు చేసి వారికి గ్రామ సర్పంచ్ ధరావత్ హైమావతి రామోజీ నాయక్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుందని ,పూర్వ విద్యార్థులు అందించిన ఈ సైకిళ్లు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం సైకిళ్లు అందించిన విద్యార్థులను సర్పంచ్‌తో పాటు ఉపాధ్యాయులు అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి శాంతయ్య, పాఠశాల హెచ్ఎం పి. విజయకుమారి, సీఆర్పీ సోమేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.