Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - ఆలేరు టౌన్
ప్రపంచ శాంతి ద్వారానే మానవాళి వృద్ధి చెందుతుందని అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం జిల్లా అధ్యక్షులు ఐలిసత్తయ్య ,కార్యదర్శి మంగ నర్సింహులు అన్నారు ఆ సంఘం ఆధ్వర్యంలో గురువారం స్థానిక వీఆర్ కళాశాల విద్యార్థులతో ప్రజాస్వామ్యం ,రాజ్యాంగ పరిరక్షణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పరిపాలన చేస్తున్న పాలకుల బాధ్యత రాహిత్య పరిపాలన కారణంగా ప్రజలు ఆందోళన బాట పడుతున్నారన్నారు. సమాజ అభివద్ధి జరగాలంటే శాంతి ప్రగతి సమన్వయం ,యుద్ధాల నిర్వహణ మానవ హక్కుల పరిరక్షణ అంశాలు లక్ష్యంతోనే ప్రపంచ శాంతి సాధ్యమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ నాళం అయ్యప్ప ,ఇతర అధ్యాపకులు , విద్యార్థులు పాల్గొన్నారు.