Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఆలేరుటౌన్
ఇటీవల కురిసిన ఎడతెరిపి లేని వర్షాల మూలంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆలేరు నియోజకవర్గంలోని పలు గిరిజన తండాలకు సంబంధించిన బీటీ రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా నిధులు మంజూరు చేయాలని ్త ,రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ను గురువారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ సభ్యులు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. తుర్కపల్లి మండలంలో మల్లాపురం నుంచి పొట్టిమర్రి తండా వయా లక్ష్మాపూర్ అంచనా వ్యయం రూ. 30 లక్షలు , వేలుపల్లి నుంచి గుజ్జవనికుంట తండా వయా జంగారెడ్డి వరకు మరమ్మతుల కోసం నిధుల మంజూరు చేయాలని వివరించారు. ఆమె సానుకూలంగా స్పందించారని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి తెలిపారు.