Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్
నవతెలంగాణ- ఆలేరురూరల్
దూసరి సత్తయ్య మరణం సీపీఐ(ఎం)కు తీరని లోటని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి ఎండి.జహంగీర్ అన్నారు. గురువారం మండలంలోని గుండ్లగుడంలో సత్తయ్య భౌతికకాయాన్ని ఆయన సందర్శించి జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పటినుండి వామపక్ష భావాలు కలిగిన వ్యక్తిగా, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ఎసిరెడ్డి నర్సింహ రెడ్డి శిష్యుడిగా, నిరంతరం ప్రజల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే నాయకుడిగా ఆలేరు ప్రాంతంలో గుర్తింపు తెచ్చుకున్న సీపీఐ(ఎం) నాయకుడు సత్తయ్య అనారోగ్య కారణం ,వద్ధాప్యంతో మరణించడం తీరని లోటన్నారు. ప్రజలు సమస్యలతో ఎక్కడ ఇబ్బంది పడుతున్నా అక్కడికివెంటనే వెళ్లి పరిష్కారం చేసే వ్యక్తిగా సత్తయ్య ముందు ఉండేవారన్నారు. సత్తయ్య నిరంతరం ప్రజా సమస్యల పై పని చేసిన వ్యక్తి అని, ఈ ప్రాంతం నుండి ఉమ్మడి భువనగిరి డివిజన్ కమిటీ సభ్యుడి గా , రైతు, రైతు కూలీల , సమస్యల పై పని చేసిన వ్యక్తి సత్తయ్య అని కొనియాడారు. ఆలేరు ప్రాంతం లో గీత కార్మికు లు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తూ పోరాటాలు నిర్వహించడంలో ముందుండేవాడని, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కారం చేయడంలో అధ్యయనం చేయడంలో మంచి అనుభవం కలిగిన వ్యక్తి అన్నారు. సత్తయ్య ఆశయాలు సాధించడం కోసం ప్రజలు,యువత ఉద్యమాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. నివాళులర్పించిన వారిలో ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ మడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరు బాలరాజు , మంగ నరసింహులు, కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బోలగాని జయరాములు, ఆ పార్టీ పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్, మండల కార్యదర్శి దూ పటి వెంకటేష్, మండల నాయకులు సూదగాని సత్య రాజయ్య,జూకంటి పౌ లు , బుగ్గ నవీన్,పిక్క గణేష్, మిట్ట శంకరయ్య, బొమ్మ కంటి లక్ష్మినారాయణ , సారయ్య ,మోరిగా డి రమేష్, మోరిగాడి చంద్రశేఖర్, మహేష్, రాజేష్, గణేష్, నరేష్, సదానందం తదితరులు పాల్గొన్నారు.