Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులుకొండమడుగు
నవ తెలంగాణ -భువనగిరి రూరల్
కలుషితమైన మిషన్ భగీరథ నీటిని వెంటనే గుర్తించి, ప్రజలు అనారోగ్యాల బారిన పడకుండా మంచి నీటిని అందించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ డిమాండ్ చేశారు.గురువారం పార్టీ మండల కార్యదర్శి వర్గ సభ్యులు కొండ అశోక్ అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు కురిసిన సందర్భంగా మండల వ్యాప్తంగా దోమలు విచ్చలవిడిగా వ్యాపించడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. వెంటనే గ్రామాలలో దోమల మందు పిచికారి చేయాలని,నీటి గుంతలల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లాలని కోరారు. మిషన్ భగీరథ పైపులైను ఎక్కడ ధ్వంసం అయిందో అధికారులు గుర్తించి వెంటనే స్వచ్ఛమైన నీరు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు సీజనల్ వ్యాధులకు గురికాకుండా పల్లె దావకానాలో డాక్టర్లను నియమించి, ప్రజలకు వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి దయ్యాల నరసింహ, కార్యదర్శివర్గ సభ్యులు ఎదునూరి మల్లేష్, అన్నంపట్ల కష్ణ, కొండమడుగు నాగమణి, మండల కమిటీ సభ్యులు ఎల్లంల వెంకటేష్, పాండాల మైసయ్య, అబ్దుల్లాపురం వెంకటేష్, కొండాపురం యాదగిరి పాల్గొన్నారు.