Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు
నవతెలంగాణ- భువనగిరిరూరల్
గ్రామీణ హమాలి కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం హైదరాబాద్ లోని ఇందిరాపార్కు వద్ద జరిగే మహాధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని, జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దాసరి పాండు అన్నారు. భువనగిరి మండల పరిధిలో ఉన్న వీరవెల్లి,చందుపట్ల,కునురు గ్రామాలలో హమాలీ కార్మికుల అడ్డాల వద్దకు వెళ్లి ప్రచారం చేశారు. అదేవిధంగా ధర్నా పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ హమాలలీ కార్మికుల సమస్యలు పట్టించుకోవడంలేదన్నారు. వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పిన ప్రభుత్వం నేటికీ చేయలేదన్నారు. ఆగస్టు 3న హైదరాబాదులో జరిగే మహాధర్నాలో కార్మికులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు.. ఈ కార్యక్రమంలో హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిలివెరి చెన్నయ్య.నాయకులు రేపాక బిక్షపతి, నల్లమాస నరసింహ, రాజు, ఎల్లెందర్ పాల్గొన్నారు.