Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
నవతెలంగాణ-బొమ్మలరామారం
ప్రకృతినే దైవంగా కొలిచే సంప్రదాయం యావత్ ప్రపంచంలో ఒక్క తెలంగాణ రాష్ట్రానికే దక్కిందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని కంచల్ తండా, తుర్కపల్లి మండలంలోని పొట్టిమర్రి గ్రామాల్లో వేర్వేరు గా నిర్వహించిన గిరిజన తీజ్ ఉత్సవాలకు ఆమె హాజరయ్యారు. గిరిజన సంప్రదాయ దుస్తులను ధరించి గోధుమ మొలకల బుట్టలతో ఉన్న తీజ్బుట్టలను ఎత్తుకుని ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం గిరిజనులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో గడపాలని మొక్కుకున్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటిఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ వైస్ చైర్మన్ బీకు నాయక్, ఎంపీపీలు సుధీర్ రెడ్డి, భూక్య సుశీల, పార్టీ మండల అధ్యక్షుల్ను వెంకటేష్ గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దునాయక్ తదితరులతో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.