Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- భువనగిరిరూరల్ /బీబీనగర్
మండలంలోని అనాజిపురం బీబీనగర్ మండలం రావిపహాడ్ తండా గ్రామాల మధ్యన గల చిన్నెటి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రయాణికుల, విద్యార్థుల, అసంఘటిత కార్మికుల, రైతుల, ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొమటిరెడ్డి చంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చిన్నెటి వాగుపై నూతన బ్రిడ్జి నిర్మాణం వెంటనే చేపట్టాలని ఆ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాజిపురం రాయిపహాడ్ గ్రామాల మధ్యన మూసి, భువనగిరి బీబీనగర్ ప్రాంతాల నుండి వచ్చే కాలువల నీళ్లు చిన్నెటి వాగు నుండి కింది ప్రాంతాలకు వెళుతున్న పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాంతంలో చిన్న వర్షం పడిన, హైదరాబాదులో వర్షం పడిన పెద్ద ఎత్తున నీళ్లు రావడంతో వాగు కిందికి ఉండడంతో వాగు దాటే పరిస్థితి ఉండదని దానితో వాగు అవతలి,ఇవతలి భాగానికి సంబంధించిన పది పదిహేను గ్రామాలకు సంబంధించిన ప్రజలు వాగు దాటలేక చుట్టూరా పది పదిహేను కిలోమీటర్లు తిరిగి పోవలసి వస్తుందని ఆవేదన వెలిబుచ్చారు.ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యే , ఎంపీ కాలువను పరిశీలించి , నూతన బ్రిడ్జి నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అనాజిపురం ఎంపీటీసీ, ఎంపీటీసీిల పురం జిల్లా అధ్యక్షురాలు గునుగుంట్ల కల్పన, సీపీఐ(ఎం) భువనగిరి మండల కమిటీ సభ్యులు గునుగుంట్ల శ్రీనివాస్, అబ్దుల్లాపురం వెంకటేష్, బీబీనగర్ మండల కమిటీ సభ్యులు సందెల రాజేష్, ముత్యాల జలెందర్, అనాజిపురం పాల సంఘం చైర్మెన్ గంగనబొయిన పాండు, సిపిఎం సినియర్ నాయకులు మహమ్మద్ జహంగీర్, తదితరులు పాల్గొన్నారు.