Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరుటౌన్
ఆలేరు నియోజకవర్గ కేంద్రంలోని దళితుల భూములు అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆక్రమిం చారని, వారి సహకారంతో దళితులకు చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని ఆరోపణలు చేస్తూ గత కొంతకాలంగా ఆరోపణలు వస్తుండగా రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేంద్రెడ్డ్డి కలుగజేసుకొని విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. .
ఆలేరు మున్సిపాలిటీ పరిధిలో దళితులకు చెందిన భూమి కార్పొరేషన్ పరిధిలో ఉందని , ఆ భూములు తమకు అప్పగించాలని కోరుతూ గతంలో దళితులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు . ఆ పాస్‌బుక్కులు ద్వారా వారు తమ భూములను ఇతరులకు క్రయవిక్రయాలు నిర్వహించారని పేర్కొన్నారు .ఇందులో ఎవరి ప్రోద్బలం లేదని తెలిపారు. అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఎలాంటి భూ ఆక్రమణలు జరగలేదని ఎంక్వైరీలో తేలిందని తెలిపారు. గత కొంతకాలంగా దళితుల భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయని ఆరోపిస్తూ ఆలేరు మున్సిపల్ చైర్మెన్ వస్పరి శంకరయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ గ్యాద పాక నాగరాజులు దళితుల భూములు అక్రమంగా కాజేశారని కొన్ని యూట్యూబ్, మీడియా ఛానెళ్లు ప్రతిరోజు ప్రచురించాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీత ,టెస్కాబ్ రాష్ట్ర వైస్ చైర్మెన్ ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసబీచైర్మెన్్ ఈ అంశంపై తక్షణమే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో గత వారం రోజుల నుండి కలెక్టర్ పమేలా సత్పతి విచారణ చేపట్టి శుక్రవారం జరిగిన సంగతి మీడియాకు వివరించారు. .దళితులు వారి అవసరాల నిమిత్తమే అమ్ముకు భూములను అమ్ముకున్నారని పేర్కొన్నారు .
దళితుల భూములపై వాస్తవాలు తేలాయి
రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి
ఆలేరు పురపాలక సంఘంలోని దళితుల భూములు ఆక్రమణకు గురయ్యాయని తన దష్టికి వచ్చింది ,దళితుల భూముల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా ఊరుకునేది లేదు , మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని దళితులకు హామీ ఇవ్వడం జరిగింది . దళితుల భూములపై విచారణకు ఆదేశాలు ఇవ్వగా జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి,ఆలేరు తహసీల్దార్ గణేశ్ నాయక్ వద్ద నివేదిక కోరింది. అనంతరం విచారణ చేపట్టారు . ఎవ్వరూ అధికార పార్టీని అడ్డం పెట్టుకొని భూ ఆక్రమణలకు పాల్పడలేదని పేర్కొన్నారు.