Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
- పోరాటాలతో ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలి :జులకంటి
నవతెలంగాణ-మిర్యాలగూడ
వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు.తమ సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఏలు చేపట్టిన సమ్మె శుక్రవారం ఐదో రోజుకు చేరుకున్నాయి.సమ్మెలో భాగంగా వీఆర్ఏలు నల్లబ్యాడ్జీలు మూతికి కట్టుకొని నిరసన తెలిపారు.ఈ సమ్మెకు పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ వీఆర్ఏల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి విస్మరిస్తున్నారని విమర్శించారు.తక్షణమే హామీలు అమలుచేయాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 23 వేల మంది వీఆర్ఏలు పనిచేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేసి ఆదుకోవాలని కోరారు.అర్హతబట్టి పదోన్నతి కల్పించాలని డిమాండ్ చేశారు. 55 ఏండ్లు నిండిన వీఆర్ఏలను విరమణ ఇచ్చి వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశము కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రికు లేఖ రాయనున్నట్లు తెలిపారు.సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు, తమ డిమాండ్లు నెరవేరేంతవరకు బలమైన పోరాటాలు చేయాలని,దీనికి తమ పార్టీ మద్దతు ఇస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు డబ్బికార్మల్లేష్, సీఐటీయూ నాయకులు డా.మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, తిరుపతి,రామ్మూర్తి, ఆర్.పరుశరాములు, రాగిరెడ్డి మంగారెడ్డి,అయ్యూబ్, పాపిరెడ్డి, కోడిరెక్క మల్లయ్య, పిల్లుట్ల సైదులు, గాయం రమ రెడ్డి, బి.వెంకటయ్య, రామరావు, వీఆర్ఏ సంఘం నాయకులు సురేష్, సైదులు, భాషా, సరిత, శిరీష తదితరులు పాల్గొన్నారు.