Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14 రకాల వస్తువులు ఇవ్వాలి
- ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి
నవతెలంగాణ-చౌటుప్పల్
రేషన్‌షాపుల ద్వారా 14 రకాల వస్తువులు ఇచ్చి ప్రజాపంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అవ్వారు రామేశ్వరి డిమాండ్‌చేశారు. శుక్రవారం ఐద్వా పట్టణకమిటీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలోని 13వ వార్డు భగత్‌సింగ్ నగర్లో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థను బలహీనం చేస్తుందన్నారు. రేషన్‌షాపుల ద్వారా 14 రకాల సరుకులు ఇవ్వాలని, బయోమెట్రిక్ విధానాన్ని రద్దుచేయాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కమిటీ సభ్యురాలు దొడ్ల ఆండాలు, నాయకురాళ్లు బత్తుల లత, వరలక్ష్మీ, సునంద, సుజాత, కావ్య, శ్రావణి, నాగలక్ష్మీ పాల్గొన్నారు.