Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎక్సైజ్, క్రీడలు , యువజన, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను గౌరవిస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ క్రీడల యువజన పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం భువనగిరి మండలం నందనం గ్రామంలో రూ.8కోట్లతో నీరా ఉత్పత్తుల కేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ వచ్చే ఆరు నెలలో పూర్తి చేసుకొని గీత కార్మికలకు అందుబాటులోకి తేవాలన్నారు. జిల్లాలో 4 నీరా సేకరణ కేంద్రాలు కూడా మంజూరు చేస్తున్నట్లు, నీరా ప్రాజెక్టు ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. నీరా అనేది తాటి, ఈత చెట్ల నుండి లభించే ప్రకతి సిద్దమైన పాణియం అని , సూర్యస్తమయం నుండి సూర్యోదయం వరకు సేకరించడం జరుగుతుందన్నారు. కల్లులో ఎటువంటి ఆల్కహాల్ ఉండదన్నారు. ఆరోగ్యానికి కావల్సిన అన్నీ రకాల సహజ సిద్దమైన ప్రోటీన్లు , అమైనో ఆమ్లాలు, విటమిన్లు, కనిజ లవణాలు, ఆరోగ్యానికి ఉపయోగ పడే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయని తెలిపారు. సభకు అధ్యక్ష వహించన భువనగిరి శాసన సభ్యులు ఫైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కుల వత్తులను ఆర్ధికంగా బలోపేతం చేసి జిల్లాలో నీరా ఉత్పత్తులను ప్రారంభించేందుకు భవనానికి నందనం గ్రామంలో రూ.8 కోట్లను ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఆలేరు శాసన సభ్యులు, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేంధర్ రెడ్డి మాట్లాడుతూ పాల సేకరణ కేంద్రాల మాదిరిగానే ముందు ముందు నీరా సేకరణ కేంద్రాలు కూడా వస్తాయన్నారు. 319 మంది నీరా సేకరణలో శిక్షణ ఇచ్చినట్లు , 12 మాస్టర్స్ కి శిక్షణ ఇచ్చిన్నట్లు తెలిపారు. జిల్లాకు నీరా సేకరణ కేంద్రాలు 4 మాత్రమే మంజూరు చేశారని , జిల్లాకు 10 అయిన ఉండాలని , ఆలేరు నియోజకవర్గానికి 6 నీరా సేకరణ కేంద్రాలు మంజూరు చేయాలని మంత్రిని కోరారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో ప్రారంభించుకోవడంతో పాటు 4 సేకరణ యూనిట్లు కూడా జిల్లాకు మంజూరు అయ్యాయన్నారు. అంగన్ వాడి సెంటర్ లకు బెల్లం అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ మంత్రిని కోరారు. ఎమ్మెల్సీ ఎలిమినేటి కష్ణా రెడ్డి మాట్లాడుతూ నీరా ఉత్పత్తి కేంద్రం కోసం తమ చిన్న వయసు నుండే పోరాటం చేశామని , అది ఇప్పటికీ అమలు అయిందన్నారు. జిల్లా పరిషత్ చైర్మెన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాట్లాడుతూ గీత కార్మికుల సహాయం కోసం ప్రభుత్వం చెట్టు పన్నును రద్దు చేసిందని , 50 ఏండ్లు దాటిన వారికి పెన్షన్ సదుపాయం కల్పిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవి రమణ, మటూరి బాలరాజు , ఎంపీపీ నరాల నిర్మల, జెడ్పీటీసీ సబ్బురు బీరు మల్లయ్య, ఎంపీటీసీి నందనం మట్ట పారిజాత శంకర్ బాబు, నందనం సర్పంచ్ ప్రభాకర్ , గ్రంధాలయ చైర్మెన్్ జడల అమరేంధర్, గౌడ సంఘం అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, నల్లగొండ డి సి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఎక్సైజ్ సూపరిటెండెంట్్ నవిన్ కుమార్, బీబీనగర్ ఎంపీపీి సుధాకర్ గౌడ్ , మాజీ ఎంపీపీలక్ష్మి నారాయణ గౌడ్, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షులు పల్లె లక్ష్మణ్ రావు, రాష్ట్ర నాయకులు, బాల రాజ్ గౌడ్, అంబాల నారాయణ గౌడ్ , రాజేందర్ ప్రసాద్ గౌడ్, చింతల మల్లేషం, అయిలి వెంకన్న, ప్రసాద్ , రాజ గౌడ్, మద్దల రమేష్ , మహిళ నాయకులు పడమటి మమత నరేందర్ రెడ్డి, మంజుల రాణి, అధికారులు పాల్గొన్నారు.