Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-మోత్కూరు
సీఎం సహాయనిధి పేదలకు వరమని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అన్నారు. మోత్కూరుకు చెందిన ఎండి. మునవర్ కు రూ.24 వేలు, వి.వినోదకు రూ.20 వేలు, మున్సిపాలిటీ పరిధిలోని బుజిలాపురంకు చెందిన పి.యాదమ్మకు రూ.32 వేలు, మండలంలోని సదర్మాపురంకు చెందిన కె.సత్తమ్మకు రూ.24 వేలుసీఎం సహాయ నిధి నుంచి మంజూరు కాగా శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలోటీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పొన్నెబోయిన రమేష్, కౌన్సిలర్ పురుగుల వెంకన్న, రైతుబంధు మండల అధ్యక్షుడు కొండా సోంమల్లు, సింగిల్ విండో మాజీ చైర్మన్ చింతల విజయభాస్కర్ రెడ్డి, ఎండి.మజీద్, విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.