Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్
నవతెలంగాణ -యాదగిరి గుట్ట
కేంద్ర ప్రభుత్వం తిసుకొని వచ్చిన నూతన లేబర్ కోడ్ లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి భూపాల్ డిమాండ్ చేశారు. పెద్దకందుకూర్లోని ప్రిమీయర్ ఎక్స్ ప్లోజివ్స్ ఎంప్లాయిస్ యూనియన్ 13వ మహాసభ తాళ్ళగూడెంలోని టెంపుల్ సిటిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం నుండి ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను కేంద్ర ప్రభుత్వం తిసుకొని వచ్చిందని ఫలితంగా కార్మికుల పని గంటలను 8 నుంచి 12 గంటలు తిసుకొని వచ్చిందని విమర్శించారు.మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 73 షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాల కోసం జిఓ విడుదల చేయలేదని విమర్శించారు.కార్మికుల కనీస వేతనాల జిఓ విడుదల కోసం ఆగస్టు 03 న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపు నిచ్చారు.ఈ మహాసభకు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి చంద్రారెడ్డి అద్యక్షత వహించగా ,జిల్లా కార్యదర్శి దాసరి పాండు,జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశంలు పాల్గొని ప్రసంగించారు.ఈ మహాసభలలో మండల కన్వీనర్ బబ్బూరి పోశెట్టి,స్థానిక సర్పంచ్ బీమగాని రాములు,ప్రిమీయర్ యూనియన్ జనరల్ సెక్రెటరీ పుప్పాల గణేష్,యూనియన్ మాజీ కార్యదర్శి చెక్క రమేష్,నాయకులు మంగ వెంకటేశం,కె గణేష్,స్వామి, గంగయ్య,అన్నపూర్ణ, లలిత తదితరులు పాల్గొన్నారు.
ఐఏన్టీయూసీ నుండి సీఐటీయూలో చేరిక
ఐఏన్టీయూసీ నుండి శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి భూపాల్ సమక్షంలో సీఐటీయూలో చేరారు.ఈ సందర్బంగా వారిని సిఐటుయు కండువాలు కప్పి ఆహ్వానించారు.