Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్
ఆగస్టు 22,23 తేదీల్లో భువనగిరిలోని రాయగిరిలో నిర్వహించనున్న సీపీఐ జిల్లా మూడవ మహాసభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణకేంద్రంలో ఆ పార్టీ మండల కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలం చెందాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల కాలంలో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ మండలకార్యదర్శి పల్లె శేఖర్‌రెడ్డి, నాయకులు కొండూరు వెంకటేశ్, ఎస్ఎ.రహమాన్, రామలింగం, రాములు, సుధాకర్, అంజయ్య, కౌసల్య, యాదయ్య, బుచ్చయ్య పాల్గొన్నారు.