Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -ఆలేరు టౌన్
ఆలేరు పురపాలక సంఘంలో జరుగు అభివృద్ధి పనులకు కౌన్సిలర్ల సమక్షంలో తీర్మానం చేసినట్టు తెలిపారు. మున్సిపల్ చైర్మెన్ వసుపరి శంకరయ్య అన్నారు .పురపాలక సంఘంలో శుక్రవారం కార్యాలయం ఆవరణలో కౌన్సిల్ సమావేశం నిర్వహించారు .ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం స్థలం, వాటర్ డ్రైనేజ్ నిర్మాణం, పైప్లైన్ నిర్మాణం చేసేందుకు అంచనా వ్యయం లక్ష్యాలు, సాధారణ పట్టణ ప్రగతి నుండి , 15వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా నిధులు కేటాయించేందుకు తీర్మానించారు.ఈ కార్యక్రమంలో కమిషనర్ మారుతీ ప్రసాద్ కౌన్సిలర్లు సీహెచ్ సునీత రెడ్డి , గుత్తా శమంతా రెడ్డి , మోర్తాల సునీత రెడ్డి ,దాసి నాగలక్ష్మి,భేటీ రాములు సాంగు భూపతి, జూకంటి శ్రీకాంత్, రాయాపురం నర్సింహులు, కందుల శ్రీకాంత్ , కౌన్సిల్ సభ్యులు బింగి లత, బ్యూలా రాణి , సిబ్బంది పాల్గొన్నారు.