Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ రాహుల్ శర్మ
నవతెలంగాణ- నార్కట్పల్లి/చిట్యాల
నార్కట్ పల్లి -అద్దంకి రహదారి, జాతీయ రహదారి పొడవునా నాటిన మొక్కల సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు .శుక్రవారం నల్గొండ,చిట్యాల,నార్కట్ పల్లి మండలంలలో కలెక్టర్ పర్యటించి అవెన్యూ ప్లాంటేషన్,పల్లె ప్రకతి వనం,బహత్ పల్లె ప్రకతి వనం,మహాత్మా జ్యోతి బా పూలే గురుకుల కళాశాల లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు .నామ్ రోడ్డు ఇరువైపులా అనేపర్తి నుండి ఎల్లారెడ్డి గూడెం వరకు నాటిన మొక్కలు జిల్లా కలెక్టర్ పరిశీలించారు.కొన్ని మొక్కలు వంగి వుండడం గమనించి వెంటనే సరి చేయాలని,పాదులు తీసి సంరక్షణ పట్ల శ్రద్ద వహించాలని సూచించారు. చిట్యాల మండలం వట్టి మర్తి గ్రామం లో పల్లె ప్రకతి వనం పరిశీలించారు.పల్లె ప్రకతి వనం నిర్వహణ పట్ల కలెక్టర్ సంతప్తి వ్యక్తం చేశారు. వెలిమి నేడు గ్రామం లో బహత్ పల్లె ప్రకతి వనం సందర్శించి మొక్కల వివరాలు తెలుసుకుని పరిశీలించారు. బహత్ పల్లె ప్రకతి వనం లో మొక్కల మధ్య పెరిగిన గడ్డి ని తొలగించాలని,బహత్ పల్లె ప్రకతి వనం లో నడిచే దారులు పాద చారులు నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు .గ్రామం లో మన ఊరుబి మన బడి కార్యక్రమం కింద ఎంపిక చేసిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంకా పనులు మొదలు కాలేదని తెలుసుకున్న కలెక్టర్ వెంటనే పనులు ప్రారంభించాలని సర్పంచ్,పంచాయతీ రాజ్ ఏఈలకు ఆదేశాలు జారీ చేశారు. ఆయన వెంట జిల్లా పంచాయతీ అధికారి విష్ణు వర్ధన్, ఎంపీడీఓలు శ్రీనివాస్ రెడ్డి(నల్గొండ),యాదగిరి గౌడ్ (నార్కట్ పల్లి), లాజర్ (చిట్యాల),వట్టిమర్తి సర్పంచ్ బుర్రి రవీందర్ రెడ్డి, వెలిమినేడు సర్పంచ్ దేశబోయిన మల్లమ్మ నర్సింహ, వట్టిమర్తి ఉప సర్పంచ్ సాగర్ల నరేష్, వట్టిమర్తి కార్యదర్శి ఉప్పునూతల నరసింహ, వెలిమినేడు కార్యదర్శి వెంకటేష్, టి ఏ రమణ, సింగిల్ విండో డైరెక్టర్ నర్ర మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.