Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవ యువతరానికి మన తరానికి స్ఫూర్తి
- రచనలను కొనియాడిన వక్తలు
నవతెలంగాణ- నల్గొండ కలెక్టరేట్
మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల లోని తెలుగు విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం దాశరధి, సి.నారాయణ రెడ్డి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన డాక్టర్ కూరెళ్ళ విఠలాచార్య సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ దాశరధి కష్ణమాచార్యులు తరతరాలకి నవతరాలకి మన తరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. నిజాం ప్రభు నిరంకుశ పాలన్నీ ఎదిరిస్తూ అనేక రచనలు చేశాడని అన్నారు. ప్రస్తుతము నిజామాబాద్ జిల్లాలోని ఇందూరులో గల జైలులో ఆయనని బందీ చేసినప్పుడు ఆ జైలు గోడలపై బొగ్గుతో నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ కవితలు రాశారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కవులకు రావాల్సినంత గుర్తింపు రాలేదని తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వము సాహిత్య రంగంలో కషి చేసిన వారికి దాశరథి సాహిత్య పురస్కారం అందజేస్తుందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య చోల్లేటి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దాశరధి కవిత్వం సామాజిక విషయాలనే కాకుండా సైన్స్ కు సంబంధించిన విషయాలను కూడా స్పశించాయన్నారు. అనంతరం దాశరధి, సి నారాయణ రెడ్డి కవితలను విద్యార్థులు రాము, శివ, సందీప్, గణేష్, ఉదరు, లిఖిత, ఆద్యపకురాలు అనిత పాడి వినిపించారు. ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ,తెలుగు విభాగము అధ్యక్షులు డాక్టర్ కే అరుణప్రియ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కె.అంజిరెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ చింతా శ్యాంసుందర్, తెలుగు విభాగం అధ్యాపకులు డాక్టర్ ఆనంద్, సీనియర్ టీచర్ నరసింహ, సత్యం, డాక్టర్ సత్యనారాయణ రెడ్డి, విద్యార్థి సంక్షేమ అధికారి మధు, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ కె వి శశిధర్, డాక్టర్ పండరయ్య, తెలుగు, ఎంఎస్డబ్ల్యూ, ఆంగ్లము, అర్థశాస్త్రము, హిస్టరీ, డెవలప్మెంట్ స్టడీస్ విభాగాల విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు శాఖ ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు
జ్ఞానపీట్ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా శుక్రవారం స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు శాఖ ఆధ్వర్యంలో సాహిత్య సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కవి, దాశరథి పురస్కార గ్రహీత వేణు సంకోజు మాట్లాడుతూ సి. నారాయణ రెడ్డి కవిత్వంలో గొప్ప మానవతా సందేశం ఉంటుందన్నారు. అనంతరం ఆయన్ను సన్మానించారు. ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ సయ్యద్ మునీర్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగు శాఖ అధ్యక్షులు డాక్టర్ తండు కష్ణ కౌండిన్య ,వైస్ ప్రిన్సిపల్ వి.శ్రీనివాసులు ,ఐక్యూఏసి కోఆర్డినేటర్ డాక్టర్ వైవిఆర్ ప్రసన్నకుమార్, పరీక్షల నియంత్రణ అధికారి బి. నాగరాజు, అధ్యాపకులు డాక్టర్ వి.వి. సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు.