Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్‌కేశవ్
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
జిల్లాలో తెలంగాణకు హరితహారం లక్ష్యం మేర పటిష్ట ప్రణాళికతో పని చేసి ఆగస్టు మాసం చివారినాటికి 8వ విడత హరితహారం మొక్కలు నాటడం పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అధికారులకు సూచించారు.శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 8వ హరితహారంపై నిర్వహణ పై జిల్లా, మండల అధికారులకు దిశా నిర్దేశం చేశారు.మండల పరిషత్ అధికారులు, మండల పంచాయతీ అధికారులు,మండల అధనపు కార్యక్రమ అధికారులు అలాగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.జిల్లాలో అన్ని శాఖల హరితహారం లక్ష్యం 71.70 లక్షలు కాగా వర్షాలు మొదలై నెలరోజులు దాటినా జాజిరెడ్డిగూడెం,మద్దిరాల మండలాలు మాత్రమే 50 శాతం లక్ష్యాన్ని అధిగమించామని,11 మండలాలు 30 శాతం కూడా లక్ష్యం చేరుకోలేదని అసంతప్తి వ్యక్తం చేశారు.మండల స్థాయిలో మండల పరిషత్ అభివద్ధిఅధికారులు హరితహారంపై పూర్తి అవగాహన కలిగి ఉండి మండలంలోని సిబ్బంది, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఈ నెలరోజుల్లో లక్ష్యం పూర్తి చేయాలన్నారు. ఒక మండలం లో 3.0 లక్ష్యల లక్ష్యం ఉండి 15 గ్రామ పంచాయతీలు ఉన్నచో సుమారుగా రోజుకి గ్రామానికి 800-1000 మొక్కలు నాటితే లక్ష్యం సాదించవచ్చునన్నారు.ఆ దిశగా ప్రణాళికతో ప్రతి గ్రామోం అనువైన ప్రాంతాలను ఎంపిక చేసుకొని రోజువారీ ప్రోగ్రెస్‌ని సమీక్షించాలని సూచించారు.మురికి కాలువల్లో నీటి నిలువ ప్రాంతాల్లో దోమల నివారణకు ఆయిల్‌తో 4 పాళ్ళు డీజిల్ కలిపి చల్లాలని, తద్వారా గ్రామాల్లో అంటువ్యాధులను నివారించాలన్నారు.మండలాల్లో ఉపాధిహామీ పనుల్లో మస్టర్లో ఖాతాల సమస్య వల్ల ఆగిపోయిన చెల్లింపుల పరిస్కారానికి విధిగా ప్రతి టెక్నికల్ అసిస్టెంట్ తన పరిధిలో ఉన్న గ్రామాల్లోని మస్టరు ఎన్ని ఉన్నాయి వాటి సవరణకు ఎన్ని ఖాతాలు కావాలో సేకరించి గ్రామాల్లోకి వెళ్ళి పంచాయతీ కార్యదర్శులుమేట్ల ద్వారా కొత్త ఖాతాలు సేకరించి సత్వరమే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇక నుండి జిల్లా సమీక్షా సమావేశాలు కేవలం మండల పరిషత్ అభివద్ధి అధికారులతోనే నిర్వహిస్తామని మండల పరిషత్ అధికారులు విధిగా మండలంలోని సమస్త సమాచారంపై అవగాహనతో సమావేశానికి రావాలన్నారు.తదుపరి సమావేశంవచ్చే బుధవారం నిర్వహిస్తామని,అప్పటి వరకు హరితహారంలో మంచిపురోగతి సాధించాలన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివద్ది అధికారి కిరణ్‌కుమార్,జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహహణ అధికారి సురేష్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి, అదనపు జిల్లా గ్రామీణాభివద్ధి అధికారి డా. పి.పెంటయ్య డీఎల్పీఓ లక్ష్మినారాయణ,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.