Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసులు పెడుతున్నారు
- 108 ఎకరాల వెంచర్ లో 54 రియల్ ఎస్టేట్ వారిది.
- మరో 54 ఎకరాలు రైతులు, ప్రభుత్వ భూమి
- తమ భూముల్లోకి వెళితే రైతులపై కేసులు,అండగా ఉన్నవారిపై దాడులు
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
రైతుల నుండి భూములు కొనుగోలు చేసి చట్టప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. జిపిఏ చేసుకొని,ప్రభుత్వ భూమిని కలుపుకొని 108 ఎకరాల్లో 1991 లో తాత్కాలిక లే అవుట్ చేశారు. రైతులకు డబ్బులు ఇవ్వకపోవడంతో రైతులు జిపిఏ క్యాన్సల్ చేసుకున్నారు.ఈదుల భాస్కర్ రావు చేసినా తాత్కాలిక లే అవుట్ లో ఉన్న ప్లాట్లను శివప్రియ రియల్ ఎస్టేట్ వారు కొనుగోలు చేసి మొత్తం డబ్బు చెల్లించలేదు.దానితో వారి ఇరువురు మధ్య గొడవ వచ్చింది.ఈ సమయంలోనే రైతులను మచ్చిక చేసుకొని మాయమాటలు చెప్పిన శివప్రియ రియల్ ఎస్టేట్ రైతుల చేత భాస్కర్ రావుకు చేసిన జిపిఏ క్యాన్సల్ చేయించారు.కోర్టుల్లో కేసులు వేసుకొన్నాక ఒకసారి రైతులకు, మరొక కోర్టులో భాస్కరరావు కు అనుకూలంగా తీర్పు వచ్చింది.ఆ తీర్పు మేరకు భాస్కర్ రావుకు 108 ఎకరాల్లో 54 ఎకరాలు చట్టబద్ధంగా కోర్టు రిజిస్ట్రేషన్ చేసింది.భాస్కరరావు, శివప్రియ రియల్ ఎస్టేట్ రాజీపడి రైతులను దగా చేసి ఇప్పుడు మళ్లీ 108 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్ చేస్తున్నారు.
రియల్టర్లకు ఉన్నది 54 ఎకరాలే
1991 లో తాత్కాలికంగా చేసిన లే అవుట్ లో ఉన్న 1,75,000గజాలను కొనుగోలు చేసినట్టు జిపిఏ చేసుకొని పాత లే అవుట్ రూపురేఖలు మార్చేస్తున్నారు. కానీ రియల్ ఎస్టేట్ వారికి చట్టబద్ధంగా ఉన్నది 54 ఎకరాలు.అయినా108 ఎకరాలు తమ ఆధీనంలోకి తీసుకొని హెచ్ఎండి ఏ అనుమతులు లేకుండానే డెవలప్ చేస్తున్నారు. తమకు లేనటువంటి 54 ఎకరాల భూమి ఇప్పటికీ చాలా వరకు రైతులపై పట్టగానే ఉంది. గ్యాంగ్ స్టర్ నయీమ్ 2016 లో రైతుల వద్ద కొనుగొలు చేసిన సర్వే నెంబర్ 12 లో 8-08 ఎకరాల భూమి సిట్ పరిధిలోనే ఉంది.సర్వే నెంబర్18 లోని 7-10ఎకరాల భూమి ఉంది.లార్డ్ గ్రెస్ ఎడ్యుకేషల్ సొసైటీ కి అమ్మిన 11-28ఎకరాలు,27-04ఎకరాలు ఇలా 54 ఎకరాలు కోర్టు కేసుల్లోనే ఉన్నాయి.ఈ భూములన్నీ నేటికి వ్యవసాయ భూములుగానే రికార్డుల్లో ఉన్నాయి.ఇప్పటికీ రైతులకు రైతు బంధు కూడా వస్తుంది.
భూముల్లోకి వెళితే రైతులపై కేసులు
భాస్కర్ రావుకు జిపిఏ చేసి కొంతకాలం తర్వాత జిపిఏ క్యాన్సల్ చేసుకున్న రైతుల భూములు రైతుల పేరు మీదే పట్టా కలిగి ఉన్నారు.కుకునూరి పాపయ్య 5 ఎకరాలు,బక్కతట్ల చిన్న నర్సింహ్మ5ఎకరాలు,బద్ధుల పెద్ద మల్లయ్య8-08ఎకరాలు,బక్కతట్ల అంజయ్య 2ఎకరాలు,పోషయ్య 2 ఎకరాలు, బచ్చయ్య 2ఎకరాలు చెంచల చిన యాదయ్య 4 ఎకరాలు,బక్కతట్ల లింగస్వామి ఎకరం పట్టా కలిగి ఉన్నారు. వీరు తమ భూముల్లోకి వెళితే వారిపై వెంచర్ చేస్తున్న రియల్టర్లు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు. తమ భూములకు వెళితే కేసులు పెట్టడం ఏంటని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇంత జరుగుతున్న కూడా ప్రభుత్వ అధికారులు పట్టించుకోకుండా రియల్టర్లకు అనుకూలంగా ఉండడం ఆందోళన కలిగిస్తుందని రైతులు అంటున్నారు.