Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే గొంగిడి సునీత
నవతెలంగాణ-ఆలేరుటౌన్
ప్రజల మధ్య ప్రజా దర్బార్ కార్యక్రమం తనపై మరింత బాధ్యత పెంచింది అని ఆలేరు శాసన సభ్యురాలు, గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి అన్నారు . నియోజకవర్గ కేంద్రంలో శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ప్రభుత్వ విప్ సునిత ఆధ్వర్యంలో ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఆలేరు లో ప్రజాదర్బార్ కు నియోజకవర్గ ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందన్నారు . సమస్యల వినతుల స్వీకరణ, పరిష్కారానికి ఆదేశించామన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యల స్వయంగా తెలుసుకొని, అక్కడికక్కడే పరిష్కార మార్గాలు చూపాలన్న లక్ష్యంతో ప్రజాదర్బార్ ద్వారా లక్ష్యం ఏర్పర్చుకున్నట్లు చెప్పారు .నియోజకవర్గం లోని 8 మండలాల ప్రజలకు చేరువలో ఆలేరు పట్టణంలోని క్యాంపు కార్యాలయం ఇందుకు వేదికగా మార్చుకున్నానని అన్నారు . నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన 62 మంది తమ సమస్యలను విప్ సునీతామహేందర్ రెడ్డికి విన్నవించుకున్నారు. సమస్యలను విన్న ఆమె త్వరితగతిన పరిష్కారం చూపాలని ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. 20 సంవత్సరాల క్రితం అప్పటి ప్రభుత్వం తమకు నివేశన స్థల ధ్రువీకరణ పత్రాలు అందించిందని, ఇంత వరకు సంబంధిత స్థలాలను చూపలేదని గొలనుకొండ గ్రామానికి చెందిన 55 మంది లబ్ధిదారులు గ్రామానికి చెందిన తీగల వెంకటేష్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. రఘునాథపురంను నూతన మండలంగా ఏర్పాటు చేయించాలని విజ్ఞప్తి చేస్తూ గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం చైర్మెన్ వస్పరి శంకరయ్య, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, వార్డు కౌన్సిలర్లు ,కౌన్సిల్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ వివిధ విభాగాలకు చెందిన అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొన్నారు.