Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉపసర్పంచ్ సంతకం లేకుండా నిధుల డ్రా అబద్ధం
- రామన్నపేట సర్పంచ్ గోదాసు శిరీష పథ్వీరాజ్
నవతెలంగాణ- రామన్నపేట
ఉపసర్పంచ్, మండల కో ఆప్షన్ సభ్యులు, ఒక వార్డు సభ్యుడు అక్రమ భూ దవీకరణ పత్రాలు పొంది, తమ కుటుంబ సభ్యుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకోని అమ్మకానికి పెట్టి, అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారే మాపై అవినీతి, అక్రమాల ఆరోపణలు చేయడం సిగ్గుచేటని, పట్టణ ప్రజలందరు అన్ని విషయాలు గమనిస్తున్నారని స్థానిక సర్పంచ్ గోదాసు శిరీష పథ్విరాజ్ అన్నారు. శనివారం స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో వార్డు సభ్యులతో కలిసి ఆమె ప్రత్యేక విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివద్ధి కోసం ఎంబి రికార్డు ప్రకారం ఖర్చు చేసిన నిధుల వివరాలనే చూపించి ప్రజలందరినీ కొందరు కావాలని తప్పుతోవ పట్టిస్తున్నారని అన్నారు. ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, ఉప సర్పంచ్, ఒకరిద్దరు వార్డు సభ్యులు వారే బురద గుంటలో ఉండి నాపై బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని, నేను అవినీతి చేసినట్లు నిరూపిస్తే సర్పంచ్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని, మీరు సిద్ధమని ఆమె సవాల్ విసిరారు. వీధి దీపాల నిర్వహణపై ఉపసర్పంచ్ సంతకం లేకుండా నిధులు డ్రా చేసినట్లు అరపిస్తున్నారని అన్ని ఎంబి రికార్డు నిబంధనల మేరకే ఖర్చు చేశామన్నారు. అక్రమ భూ ధ్రువీకరణ పత్రాలు రద్దు చేయాలని కలెక్టర్ కు ఫిర్యాదు చేసినందునే తనపై అవినీతి అభియోగాలు మోపుతున్నారని విమర్శించారు. పంచాయతీకి వచ్చిన నిధులతో మొత్తం 14 వార్డులలో 120 డ్రైనేజీల నిర్మాణం ఎంబి రికార్డు ప్రకారమే చేశామని ఆమె తెలిపారు. తన కుటుంబం రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే తనపై ఆరోపణ చేస్తున్నారని ఆమె ఆరోపించారు. మండల ప్రజా పరిషత్ బాట విషయమై తనపై అక్రమ రిజిస్ట్రేషన్ అభియోగంకు నాకు ఎలాంటి సంబంధం లేదని ఆమె తేల్చి చెప్పారు. గతంలో ఒక వార్డు సభ్యుడు అక్రమ రిజిస్ట్రేషన్ చేసుకుంటే చర్యలు చేపట్టాలని కోరిన ఉపసర్పంచే నేడు అతనితో కలిసి ఆరోపణలు చేయడం అంటే ప్రజలు అర్థం చేసుకోవాలని ఆమె కోరారు. అవినీతి అక్రమాలకు పాల్పడే వారిని ప్రోత్సహించలేదు కాబట్టి నేటికీ వరకు నలుగురు పంచాయతీ కార్యదర్శులు మారారని, నేనే అవినీతికి పాల్పడితే వారెలా మారారో గ్రహించాలని ఆమె అన్నారు. నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ కాంట్రాక్టర్ అయిన ఎంపీటీసీ ని పంచాయతీ భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తిచేయాలని అడిగినందునే ఆయన కూడా అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. నిరాధారణ ఆరోపణలను ప్రజలు నమ్మొద్దని, ఎప్పుడు వివరాలడిగిన ప్రజల ముందు ఉంచుతామని తెలిపారు. ఈ సమావేశంలో వార్డు సభ్యులు గొలుసుల ప్రసాద్, లగ్గోని యాదయ్య, ఎటెల్లి సునీత శ్రీనివాస్, కొమ్ము సుస్మిత చంద్రశేఖర్, లేంకల జ్యోతి ప్రవీణ్ లు ఉన్నారు.