Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయ క్షేత్రం వద్ద స్తూపావిష్కరణ
- సభకు హాజరైన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్
నవతెలంగాణ-ఆలేరుటౌన్
వడ్డెమాన్ శ్రీనివాసులు మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని యాదాద్రిభువనగిరి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం వడ్డేమాన్ శ్రీనివాసులు స్తూపాన్ని ఎండి జహంగీర్.ఆవిష్కరించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ వడ్డేమాన్ శ్రీని వాసులు తను బతికినంత కాలం ఎర్రజెండాను నమ్మి బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేశాడని, అతని మరణం పార్టీకి, ప్రజా పోరాటాలకు తీరని లోటు అని అన్నారు. ఆలేరు ప్రాంతంలో పీడిత తాడిత ప్రజల కోసం పోరాటాలు నిర్వహించడమే వడ్డేమాన్ శ్రీనివాసులకి నిజమైన నివాళి అన్నారు.
దోపిడీ రహిత సమాజ నిర్మాణం కోసం ఉధృత పోరాటాలు : పైళ్ల ఆశయ్య
దోపిడీ లేని సమాజ నిర్మాణంకోసం ఉద్ధతంగా పోరాటాలు నిర్వహించడమే వడ్డేమాన్ శ్రీనివాసులుకు నిజమైన నివాళి అర్పించినట్టవుతుందని రజక సంఘం రాష్ట్ర కార్యదర్శి పైళ్ల ఆశయ్య అన్నారు .పట్టణం లోని ఎలగందుల మినీ ఫంక్షన్ హాల్ లో సీపీఎం పట్టణ కార్యదర్శి ఎంఏ ఇక్బాల్ అధ్యక్షతన వడ్డేమాన్ శ్రీనివాసులు సంతాప సభ జరిగింది. ఈ సంతాప సభకు హాజరైన పైళ్ల ఆశయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు మాట్లాడుతూ వడ్డెమాను శ్రీనివాసులు వత్తిదారుల కుటుంబంలో పుట్టినప్పటికీ నిరంతరం దోపిడీ లేని సమాజం నిర్మాణం కోసం పని చేశారన్నారు. ప్రజలకు సమానత్వం కోసం నిరంతరం పరతపించే వాడని, వత్తిదారులకు అణగారిన వర్గాలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను ముందుండి పరిష్కరించే వాడని ,వడ్డేమాన్ శ్రీనివాసులు లేని లోటు తీర్చలేనిదని అన్నారు. శ్రీనివాసులు చిన్నతనం నుండి విద్యార్థి ఉద్యమంలో పాల్గొంటూ అనంతరం వత్తిదారుల సమస్యల కోసం, బలహీన వర్గాల కోసం జరుగుతున్నటువంటి పోరాటాలలో, ఇండ్లు ఇళ్ల స్థలాల కోసం అనేక పోరాటాలు నిర్వహించారని చెప్పారు . పార్టీ ఏ ఉద్యమం నిర్వహించిన అందులో శ్రీనివాసులు అగ్ర భాగాన ఉండేవారని అన్నారు. స్థూపం ఆవిష్కరణ, సంతాపసభ కార్యక్రమాల్లో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మంగ నరసింహులు ,హైకోర్టు సీనియర్ అడ్వకేట్ జి అరుణ్ కుమార్ ,సిపిఎం మండల కార్యదర్శి దూపటి వెంకటేష్ ,సిఐటియు మండల కన్వీనర్ మోరిగాడి రమేష్ , రజక సంఘం నాయకులు గుమ్మడి ఆంజనేయులు, ఆలేటి భాస్కర్, ఆలేటి బాలరాజు, రజక సంఘం నాయకులు సటు తిరుమలేశు ,డిటిఎఫ్ జిల్లా నాయకులు సత్యనారాయణ, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు బొమ్మ కంటి బాలరాజు ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు జూకంటి పావుల్ , ఆలేరు పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు తాళ్లపల్లి గణేష్, ఎలుగల శివ , డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బుగ్గ నవీన్, సూదగాని సత్య రాజయ్య , వడ్డేమాన్ బాలరాజు, వడ్డేమాన్ విప్లవ్ ,బొమ్మ కంటి లక్ష్మీనారాయణ, పిక్క గణేష్, సంగి రాజు, బోడ భాగ్య ,హనుమంతు, మొరిగాడి అజరు, గొడుగు దాసు, యెల్లల వెంకటేష్, బొప్పిడి యాదగిరి, మోడీ మహేష్, మొరిగాడి అశోక్, నల్ల మాస తులసయ్య, మిట్ట శంకరయ్య, మొగిలిపాక కృష్ణ, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.