Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు పి.అంజన్రావు
నవతెలంగాణ-చండూరు
బాలల హక్కుల పరిరక్షణ కు అందరు కృషి చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమీషన్ సభ్యులు పొనుగోటి అంజన్రావు అన్నారు.శనివారం సమగ్ర బాలల పరిరక్షణ పథకంపై జరిగిన అవగాహన కార్యక్రమంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరైన ఆయన గట్టుప్పల పాఠశాలను సందర్శించి అక్కడ పిల్లలకు బాలల హక్కులు ఏ విధంగా అమలు జరుగుతున్నాయనేది అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు పలు సమస్యలు ఆయన దష్టికి తెచ్చారు. రైతువేదికలో జరిగిన అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతూ బాలల హక్కులను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.బాలల హక్కులకు ఎటువంటి భంగం కలిగినా 1098 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు.బాల్యవివాహాలు జరిగినట్లు ఎవరికీ తెలిసిన అధికారుల దష్టికి తేవాలని సూచించారు. బాలలకు సరియైన విద్య, వైద్యం, పౌష్టికాహారం అందుకోవడం బాలల హక్కు అన్నారు. బాలల సమస్యలపై గ్రామం యూనిట్ గా బాలల హక్కుల పరిరక్షణ జరగాలని అన్నారు. బాలల హక్కులకు భంగం కలగకుండా చూసే బాధ్యత కమీటీలకు ఉందన్నారు. శిశువు గర్భంలో ఉన్న నుంచి బాలలకు అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించడం, బాలల విద్యాభివద్ధి కి రెసిడెన్షియల్ పాఠశాలలు,కెజిబివిల ఏర్పాటు తో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుందని చెప్పారు. బాలల హక్కులకు భంగం కలిగించే ఏ విషయం ఉన్న బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ దష్టికి తీసుకుని వస్తే తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వేల్పేర్ కమిటీ సభ్యులు చింత కష్ణ,ఈద భాస్కర్,ఏం.ఇ.వొ గురువారావు,సిడిపివో కవిత, సోషల్ వర్కర్ ఇడం కైలాసం, సీనియర్ జర్నలిస్టు భీమగాని మహేశ్వర్ గౌడ్, స్వచ్చంధ సంస్థల వారు మలిగే యాదయ్య, గణేష్, ఆంటోనీ తదితరులు పాల్గొన్నారు.