Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బిక్కుబిక్కుమని కాలమెళ్లదీస్తున్న విద్యార్థులు
నవతెలంగాణ-చివ్వెంల
మహాత్మాజ్యోతిబాఫూలే రెసిడెన్షియల్ పాఠశాలలో ఎలుకలు కలకలం సష్టిస్తున్నాయి. పాఠశాలలో (నాగారం) విద్యార్థులను ఎలుకల కరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.నాగారం మండలానికి సంబంధించిన రెసిడెన్షియల్ పాఠశాలను చివ్వెంల మండలకేంద్రంలో ఏర్పాటు చేశారు.ఈబాలుర పాఠశాలలో ఈనెల 11 నుండి 30వ తేదీ వరకు 19 మంది విద్యార్థులను ఎలుకలు కరిచాయి. విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.ఎలుకలు కరిచిన విద్యార్థులను గుట్టు చప్పుడు కాకుండా మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యం చేయిస్తున్నారు.పాఠశాల నిర్వహణ విద్యార్థుల సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రిన్సిపాల్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
విద్యార్థులను ఎలుకలు కరిచిన మాట వాస్తవమే
ప్రిన్సిపాల్-లక్ష్మీ
చుట్టూ పంట పొలాలు, టేకు తోట ఉండడంతో ఎలుకలు వస్తున్నాయి.తగిన ఏర్పాట్లు చేస్తున్నాం.