Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటటౌన్
2019లో జిల్లా కేంద్రంలో చేపట్టిన మెయిన్ రోడ్ విస్తరణలో భాగంగా స్వంత ఇల్లు, దుకాణంతో పాటు జీవనోపాధి కోల్పోయిన నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు రాంరెడ్డి దామోదర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల సమీపంలో అద్దె ఇంట్లో అనారోగ్యంతో ఉన్న గుండా భారతమ్మ, ఆమె కుమారుడు గుండా రాఘవయ్య లను ఆయన పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారతమ్మ కుటుంబానికి అండగా నిలుస్తామని మనోధైర్యం కల్పించారు. నల్గొండ పార్లమెంటు సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ సహాయం అదే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. మంత్రి జగదీష్ రెడ్డి ఆ కుటుంబానికి సాయం చేయాలని కోరారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అంజద్ ఆలి, కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్,కౌన్సిలర్ బైరు శైలేందర్,కుందమల్ల శేఖర్ఉన్నారు.