Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహణ
- అదనపు కలెక్టర్ మోహన్‌రావు
నవతెలంగాణ-సూర్యాపేటకలెక్టరేట్
ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సవరించిన ఫారంలు ఆగస్టు ఒకటవ తేదీ నుండి అమలులోకి రానున్నాయని అదనపు కలెక్టర్ యస్.మోహన్‌రావు అన్నారు.శనివారం కలెక్టరేట్లోని ఆయన చాంబర్లో ఈసీఐ సవరించిన ఫారమ్స్‌పై జిల్లాలోని వివిధ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఈసీఐ సూచనల మేరకు గతములో ముద్రించిన ఫారంలు ఎక్కడకూడా ఇకపై వినియోగించవద్దని తెలిపారు.సవరించినఫారమ్స్ 1, 2, 2ఏ, 3, 6, 7, 8, 11, 11ఏ, 11బీబి, 18, 19 లలో సవరణలు జరిగాయన్నారు.వాటిపై పార్టీల ప్రతినిధులు పూర్తి స్థాయి అవగాహన కల్పించారు.2023 సమ్మరి రివిజన్ పై కూడా ఈ సందర్బంగా అవగాహన కల్పించారు.సవరించిన ఫారముల పై నియోజక వర్గాల వారీగా జిల్లా స్థాయి మాస్టర్ టైనర్ పి.యాదగిరి,తహసీల్దార్ జాజిరెడ్డిగూడెం ఆధ్వర్యంలో ఈఆర్ఓ, ఏఈ ఆర్ఓ, ఎలక్షన్ డీటీలు, బీఎల్ఓలు, ఎలక్షన్ ఆపరేటర్లకు సవరించిన ఫారంలపై అవగాహన కల్పించామన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నుండి వెన్న మధుకర్‌రెడ్డి, సీపీఐ(ఎం) నాయకుల కోటగోపి, సీపీఐ నుండి బి.వెంకటేశ్వర్లు, ఎలక్షన్ పర్యవేక్షకులు పద్మారావు, సుదర్శన్‌రెడ్డి, ఎలక్షన్ డీటీ కల్యాణ్, సిబ్బంది పాల్గొన్నారు.