Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
ఢిల్లీలో ఏడాది పాటు జరిగిన రైతాంగఉద్యమం సందర్భంగా సంయుక్త కిసాన్ మోర్చాకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నేడు జరిగే దేశ వ్యాప్త రాస్తారోకోలో భాగంగా జిల్లావ్యాప్తంగా నిర్వహించే రాస్తారోకోలను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జునరెడ్డి పిలుపునిచ్చారు.శనివారం స్థానిక ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన వామపక్ష పార్టీల సమావేశంలో ఆయన మాట్లాడారు.డిసెంబర్ 9, 2021న కిసాన్ మోర్చా పోరాటం విరమణ సందర్భంగా రైతులకు ఇచ్చిన లిఖితపూర్వక వాగ్దానాలను కేంద్ర ప్రభుత్వం విస్మరించినదన్నారు.కనీసమద్దతు ధరపై కమిటీ ఏర్పాటులో మోసం చేసిందన్నారు.రైతులపై మోపిన తప్పుడు కేసులు ఎత్తివేయలేదని, ఆందోళన విరమించుకున్న సమయంలో విద్యుత్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు.ప్రభుత్వం చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా షహీద్ ఉధమ్‌సింగ్ అమరవీరుని వర్థంతిని పురస్కరించుకుని నేడు దేశవ్యాప్తంగా జిల్లా, ,మండల స్థాయిలో ద్రోహానికి వ్యతిరేకంగా నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులపై రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు.ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని రాస్తారోకోను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వరికుప్పల వెంకన్న, రామచంద్రన్ వర్గం రాష్ట్ర నాయకులు బుద్ధాసత్యనారాయణ, బహుజన కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యదర్శి చామకురి నర్సయ్య, న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు గంట నాగయ్య ప్రజపంథా జిల్లా నాయకులు రామోజీ,సీఐటీయూ జిల్లా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నెమ్మాది వెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు, సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు ఏలుగూరి గోవిందు, కోటగోపి, మేకనబోయిన శేఖర్, చిన్నపంగి నరసయ్య, జె.నర్సింహారావు,ఎంసీపీఐయూ జిల్లా కార్యదర్శి ఎస్కె.నజీర్, ప్రజాపంథా జిల్లా నాయకులు ఎర్రఅఖిల్, జహంగీర్, సీఐటీయూ పట్టణ కన్వీనర్ మామిడి సుందరయ్య, నాయకులు చిట్టిబాబు పాల్గొన్నారు.