Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
చేనేత కార్మికుల బీమా కోసం కషి చేస్తానని ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు. మండల కేంద్రంలో శనివారం కమలమ్మ జనార్దన్ గార్డెన్ ఆవరణలో శివ శంకర్ పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద్ భాస్కర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి లతో కలిసి మాట్లాడారు. మోత్కూరు చేనేత కార్మికుడికి లివర్ చెడిపోగా చికిత్స కోసం 25 లక్షల రూపాయలు మంజూరు చేయించినందుకుగాను ఎల్ రమణ కి జిల్లా మండల పట్టణ సంఘం సభ్యులు కతజ్ఞతలు తెలిపారు. . చేనేత కార్మికుల ఇన్సూరెన్స్ ప్రభుత్వం ద్వారానే అందించేలా కషిచేస్తానని తెలిపారు. పద్మశాలీ సంఘం సభ్యులకు జియోట్యాగ్ ఏర్పాటు అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు తన దష్టికి తీసుకురావాలని వచ్చే సోమవారం మంత్రి కేటీఆర్ తో కరీంనగర్ జిల్లా కేంద్రంలో సమస్యల పరిష్కారం కొరకు చర్చిస్తానన్నారు. ఆహ్వానితులకు శాలువా పూలమాలలతో సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. మాజీ జెడ్పీటీసీ సభ్యులు బొట్ల పరమేశ్వర్ సభాధ్యక్షత వహించగా పట్టణ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షుడు గా పాశికంటి శ్రీనివాస్ , అధ్యక్షుడిగా నర్సింహులు యువజన విభాగం అధ్యక్షులు ద్వారా శంకర్ చందూ, చెన్న రాజేష్ ఇతర కమిటీ సభ్యులకు ఆహ్వానితులు నియామక పత్రము సభా ముఖంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు చిక్కా వెంకటేష్,గుండేటి శ్రీధర్, దాసి సురేష్ , పీఏ సీఎస్ వైస్ ఛైర్పర్సన్ చింతకింది చంద్రకళ మురహరి, గ్రంథాలయాల డైరెక్టర్ బాల స్వామి ,మాజీ సర్పంచ్ చింతకింది మురళి కందగట్ల నిర్మలా నరేందర్, ఇన్ఛార్జి సర్పంచ్ దాసి సంతోష్, కౌన్సిలర్లు బేతి రాములు, దాసి నాగ లక్ష్మి , నాయకులు చింతకింది రామానుజం, మల్లయ్య, గుజ్జ అశోక్ , కటకం సత్యనారాయణ, మల్లేశం ,రాచర్ల నరసింహులు ,బోగ సంతోష్ పద్మశాలీ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు .