Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
నవతెలంగాణ-కోదాడరూరల్
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలి అని శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శనివారం పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ చింతా కవిత రాధారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి ముందుగానే నివారణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. డాక్టర్లు ఎప్పటికప్పుడు గ్రామాల్లో సందర్శిస్తూ తగిన సూచనలు చేయాలని వారు ఆదేశించారు . గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తానని ఆయన తెలిపారు. గ్రామాలలో పెండింగ్ ఉన్న సమస్యలు పరిష్కారానికి కషి చేస్తానని ఆయన తెలిపారు. పనులు చేయడంలో అధికారులు అలసత్వం వహించ వద్దు అని అన్నారు. అధికారులు ప్రజల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు అభివద్ధి కోసం అడిగే పనులను తప్పకుండా చేయాలని ఆయన అన్నారు.విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని, అధికారులు ప్రతి ఒక్కరు తమ యొక్క విద్యుక్త ధర్మాన్ని పాటించాలని ఆయన అన్నారు. మండలానికి సంబంధించి అన్ని విధాలుగా అభివద్ధి పనులు జరుగుతున్నాయని, రాబోయే రోజుల్లో కోదాడ మండలాన్ని అన్ని విధాలుగా అభివద్ధి చేసేందుకు కషి చేస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య, ఎంపీడీఓ విజయశ్రీ, ఆయా గ్రామాల ఎంపీటీసిలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు, పాల్గొన్నారు.