Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కోదాడరూరల్
రాష్ట్ర సరిహద్దుల్లో గంజాయి వందల కేజీలు పట్టుబడుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.గత ఐదు నెలల నుండి రామాపురం క్రాస్ రోడ్ వద్ద పోలీసులు విస్తత తనిఖీలలో టన్నుల కొద్దీ గంజాయి దొరకడం, ఆ గంజాయి పట్టణానికి చెందిన యువకుల హస్తం ఉండడంతో పోలీసులు పలువురు పై కేసులు నమోదు చేశారు. ప్రతి నెలలో కనీసం గంజాయి రవాణా లో ఐదు నుండి పది కేసులు నమోదు కావడంతో పోలీసులే విస్తు పోతున్నారు.శనివారం సాయంత్రం 200 కేజీల గంజాయి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదే రాత్రి మూడు క్వింటాల గంజాయి దొరకడంతో దొరికిన గంజాయి. ఆదివారం తెల్లవారుజామున సైతం ఐదు కేజీల గంజాయి దొరకడంతో పోలీసులే విస్తుపోతున్నారు.ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో గంజాయి అక్రమ రవాణాపై కోదాడ స్టేషన్లలో కేసులు నమోదవడం కోదాడ నియోజకవర్గపరిధిలోని స్టేషన్లో కేసులు నమోదు కావడం ఒక్కింతకు ఆందోళనకు గురిచేస్తుంది.రానున్న రోజులలో కోదాడ గంజాయికి అడ్డాగా మారుతుందా సామాన్య నుండి తలెత్తుతున్న ప్రశ్నలు..నిన్నటి వరకు కేవలం యువకులు ఏదో డబ్బు కోసం గంజాయికి బానిసలై గంజాయి రవాణా చేస్తున్నారని అనుకున్న నియోజకవర్గ ప్రజలకు నేరుగా గంజాయి రవాణాలో అధికార పార్టీ నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారని తెలియడంతో పట్టణ ప్రజలు కొన్ని రోజులుగా ఇదే విషయమై చర్చించుకోవడం విశేషం.నకిరేకల్ వద్ద తనిఖీలో కొమరబండకు చెందిన యువకున్ని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా పట్టణంలోని పలువురు టీఆర్ఎస్ నాయకుల పేర్లు వెల్లడించినట్టు సమాచారం.ఆ దిశగా నల్లగొండ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణను కొనసాగిస్తున్నారు.ఈ విచారణలో పలువురు అధికార పార్టీ నాయకుల పేర్లు ఉన్నట్టు తెలుస్తుంది.పట్టణానికి చెందిన అధికార పార్టీ నాయకుల పేర్లు ఉండడంతో వారిపై కేసు నమోదు కాకుండా ప్రజాప్రతినిధులు తీవ్రఒత్తిడి తెస్తున్నారని చర్చించుకుంటున్నారు.ప్రజా ప్రతినిధులకు తలొగ్గి పోలీసులు కేసును పక్కదారి పట్టిస్తారా లేక పట్టుబడ్డ నిందితుల పేర్లు బయటపెడతారా అని పట్టణ ప్రజలు వేచి చూస్తున్నారు.ఇంత జరుగుతున్నా ఆంధ్రా-తెెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో గంజాయి రవాణా మాత్రం తగ్గడం లేదు.అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని గంజాయి రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.