Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీడబ్య్లూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపు
నవతెలంగాణ-భువనగిరి
73 షెడ్యూల్డ్ ఎంప్లాయీమెంట్ పరిశ్రమల కనీస వేతనాల జీఓలను సవరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3న చలో హైదరాబాద్‌కు తరలివెళ్దామని బీసీడబ్య్లూ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమటిరెడ్డి చంద్రారెడ్డి భవన నిర్మాణ కార్మికులకు పిలుపునిచ్చారు.ఆదివారం స్థానిక సుందరయ్య భవన్లో బీసీడబ్య్లూ జిల్లా అధ్యక్షులు గొరిగె సోములు అధ్యక్షతన జిల్లా కమిటి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రతిఐదేండ్లకోసారి సవరణ చేయాల్సిన జీఓలను 10-12 సంవత్సరాలవుతున్నప్పటికీ ఏ ఒక్క జీఓను సవరించకుండా కార్మికుల శ్రమను యథేచ్ఛగా దోపిడీ చేసుకునేందుకు యాజమాన్యాలకు కావల్సినంత అండగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందన్నారు.5 షెడ్యూల్డ్ ఎంప్లాయ్మెంట్ పరిశ్రమలకు ఇచ్చిన నోటిఫికేషన్ కు వెంటనే గెజిట్ చేసి కనీసవేతనం 18,000/- రూ?లు అమలు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్మిక చట్టాలను పునరుద్ధరించాలన్నారు. యాజమాన్యాలకు అనుకూలంగా చట్టాలు చేయడం వల్ల కార్మికులు కట్టుబానిసలుగా పని చేయాల్సివస్తుందన్నారు. ార్మికులకు అండగా ఉండాల్సిన కార్మికశాఖ అధికారులను ప్రేక్షక పాత్రలోకి పాలకులు నెట్టివేశారన్నారు.యాక్సిడెంటల్ డెత్‌కు రూ.10 లక్షలు, సహజ మరణంకు రూ.5 లక్షలు, వివాహ కానుక - ప్రసూతి కానుక రూ.లక్ష వరకు పెంచాలని కోరారు. బీసీడబ్య్లూ జిల్లా నాయకులు అరూరు నర్సింహ, కలకుంట్ల శివకుమార్, బీరయ్య, జినుక కుమార్, పబ్బతి యాదగిరి, పుర్రు రాములు, రాసాల రమేశ్, మహేష్ పాల్గొన్నారు.
మోటకొండూర్ :హమాలీ భవన నిర్మాణ ట్రాన్స్‌పోర్టు రంగాల కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆగస్టు 3న తలపెట్టిన చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే మహా ధర్నాను మండలంలోని అసంఘటిత రంగ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మోట కొండూరు మండల హమాలీ కార్మికులతో వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం అధ్యక్షులు మామిడాల కనకయ్య, జంగావెళ్లి శ్రీను, చెరుకు అనిల్, బొట్ల తిరుమల్, కాంబోజి శ్రీను, కాంబోజి వెంకటేష్, బీరయ్య నరసింహా లక్ష్మయ్య, భాస్కర్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
బీబీనగర్ : షెడ్యూల్ ఎంప్లాయీమెంట్ పరిశ్రమల కనీస వేతనాల జీవో సవరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ తలపెట్టిన ఆగస్టు 3న చలో హైదరాబాద్ విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులుకోమటిరెడ్డి చంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మండలకేంద్రంలో కార్మికులతో కలిసి చలో హైదరాబాద్ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు బండారు శ్రీరాములు, క్లస్టర్ నాయకులు కందడి దేవేందర్‌రెడ్డి, నాయకులు రక్తం నర్సింహ, బింగి ప్రసాద్, గుంటిమిది నాగరాజు, బసవ రెడ్డి, పాశం బాలయ్య, పెరుమళ్ళ స్వామి, పల్లెపాటి వెంకటేష్, పోచయ్య, తదితరులు పాల్గొన్నారు.